విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు మరియు సీనియర్ న్యాయవాది అలోక్ కుమార్ పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరుగుతున్న హిందువుల దారుణ హత్యలు, అల్లర్లు, దహనం, హింస, దోపిడీ మరియు పెద్ద ఎత్తున వలసల సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతుంటాయి కానీ, హింస మరియు హిందువులపై దాడులు విస్తృతంగా బెంగాల్లో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయని! ఈరోజు వారు ప్రశ్నించారు. ముర్షిదాబాద్ యొక్క మొత్తం సంఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏతో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మాల్దాలోని సహాయ శిబిరాల్లో నివసిస్తున్న హిందూ సమాజానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన సంస్థలను సేవ చేయకుండా నిరోధించడం కూడా అమానవీయ చర్య అని ఆయన అన్నారు.
కోల్‌కతాలోని అలీపూర్‌లోని భాషా భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో విహెచ్పి అధ్యక్షుడు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హిందువులపై జరుగుతున్న జిహాదీల దాడులపై మౌనం వహిస్తున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులు ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగాయని, విదేశీ బంగ్లాదేశీయుల హస్తం ఉందని, ఇది అంతర్జాతీయ సమస్య అని ఆమె చెబుతున్నప్పటికీ, ఘటనపై ఎన్ఐఏ విచారణకు ఆమె ఎందుకు డిమాండ్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. బాధితులైన హిందువులకు న్యాయం జరగాలని, దాడి చేసిన జిహాదీలకు కఠిన శిక్ష పడాలని మేము కోరుతున్నామని అన్నారు. దోపిడీకి , దగ్దానికి లేదా ధ్వంసానికి గురైన హిందువుల ఆస్తికి వెంటనే పరిహారం చెల్లించాలి మరియు రాష్ట్రంలో హిందువులకు భద్రత కల్పించాలి అని అన్నారు.
దేశవ్యాప్తంగా ఏదో ఒక అంశంపై నిరసనలు జరుగుతూనే ఉంటాయని, అయితే గత కొన్నేళ్లుగా బెంగాల్లో ఆ నిరసనల పేరుతో హిందువులపై దాడులు మరియు వారి దారుణ హత్యలు ఒక ప్రణాళిక బద్దంగా జరుగుతున్నాయని శ్రీ అలోక్ కుమార్ అన్నారు. ప్రభుత్వ ఉదాసీనత మరియు అధికార పార్టీ యొక్క ప్రత్యక్ష లేదా పరోక్ష మద్దతు లేకుండా ఇలాంటి తీవ్రవాద మరియు అసాంఘీక శక్తులు ఇలాంటి దాడులు చేయలేవు కాబట్టి, నిరసన ఎవరిపై ఉన్నప్పటికీ, నిరసనకారులు హిందువులను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారో కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ముర్షిదాబాద్ నుండి మాల్దాకు శరణార్థులుగా వెళ్లవలసి వచ్చిన హిందూ సమాజం యొక్క బాధిత హృదయాలకు ఓదార్పునివ్వడం లేదా వారిని ఓదార్చడం మాట దేవుడెరుగు, ఆ బాధిత హిందూ సోదరీమణులు, కుమార్తెలు, పిల్లలు, వృద్ధులు మరియు ఇతర వ్యక్తులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థలకు ఆహారం, నీరు, భోజనం లేదా ఇతర అవసరమైన జీవిత సౌకర్యాలను అందించడానికి ప్రయత్నిస్తున్న స్వచ్భంద సంస్థలపై ప్రభుత్వం విరుచుకుపడుతోందని మండిపడ్డారు.
వారికి సహాయం చేయకుండా కూడా ప్రభుత్వం నిషేధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహాయ సామాగ్రిని మాకు ఇవ్వండి, మేము పంచుతామని ప్రభుత్వం అంటోందని, ఇది ఎలాంటి ప్రవర్తన? ఇది మానవ జీవిత విలువలతో ఆటలా కాదా! ప్రభుత్వం స్వయంగా పంపిణీ చేయాలనుకుంటే, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఏమిటి? అని ప్రశ్నించారు.
తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి అనేక బాధిత కుటుంబాలను ప్రభుత్వం బలవంతంగా ముర్షిదాబాద్‌కు తిరిగి పంపుతోందని ఆయన అన్నారు. అయితే, కేంద్ర బలగాలు భద్రతను పూర్తిగా ఏర్పాటు చేసే వరకు తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆ కుటుంబాలు చెబుతున్నాయన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి అక్కడికి వెళ్లము అని వారు అంటున్నారని పేర్కొన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం హిందువులను బలవంతంగా తోడేళ్ల ముందు విసిరివేయడం వారిని బ్రతికుండగానే చంపడం కాదా? ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని అలోక్ కుమార్ డిమాండ్ చేశారు.