పాస్టర్ బజిందర్ సింగ్కి అత్యాచారం కేసులో జీవిత ఖైదు పడింది. 2018 లో ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అతడ్ని మొహాలీ కోర్టు దోషిగా తేల్చింది. తాజాగా ఆయనకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులుగా వున్న మరో ఐదుగుర్ని న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చింది.
కాగా బాజిందర్ సింగ్ తరచూ వివాదాల్లో ఉంటుంటాడు. ఇటీవల ఆయన తన కార్యాలయంలో ఓ మహిళపైన, మరో వ్యక్తిపైన దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారిని చెంపలపై కొట్టడం, చేతికి ఏది దొరికితే అది విసరడం లాంటి దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. 2022లో ఓ 22 మహిళ సింగ్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. 2022లోనే అనారోగ్యంతో ఉన్న ఓ మహిళను బాగుచేస్తానని చెప్పి ఆమె కుటుంబం నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. కానీ ఆమె మరణించింది.