తిరుమలలో శ్రీవారి ఆలయం నుంచి విమానం మళ్లీ ప్రయాణించింది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఆలయంపై నుంచి దూసుకెళ్లింది.
ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడం ఆగమశాస్త్రానికి విరుద్ధం. ఈ వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే నో ఫ్లయింగ్ జోన్‌గా తిరుమలను ప్రకటించాలని అనేక సార్లు కేంద్ర పౌర విమానయాన శాఖను తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది.
అయినా, తమ విజ్ఞని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడింది. ఇటీవల శాఖ ప్రస్తుత మంత్రి, రామ్మోహన్ నాయడుకు సైతం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారు. ఇటీవల తరుచుగా విమానాలు శ్రీవారి ఆలయంపై నుంచి వెళ్తున్నాయి. అయితే, గతంలో పోలిస్తే ఇవాళ గోపురానికి సమీపంపైనే విమానం వెళ్లింది. ఈ చర్యపై భక్తులు మండిపడుతున్నారు. కేంద్ర పౌర విమానయాన మంత్రి వెంటనే స్పందించి తిరుమల దేవస్థానాన్ని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్