మహా రాష్ట్రలోని థానేలో జరుగుతున్న ఆరెస్సెస్ శిక్షణా శిబిరంపై దాడి జరిగింది. అయితే దాడి చేసిన వారిని పోలీసులు ఇంకా గుర్తించలేదు. సీసీ టీవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డోంబివాలిలోని కచోర్ గ్రామంలో ఆరెస్సెస్ చిన్నారుల కోసం ఓ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ శిబిరంలో శిక్షణను ఇస్తున్నారు. ఈ సమయంలోనే దుండగులు రాళ్లు రువ్వారు. అయితే.. ఈ రాళ్ల దాడిలో ఎవ్వరికీ గాయాలు కాలేదు.
ఇక... సంఘ్ బాధ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు తాము నిందితులను గుర్తించే పనిలో వున్నామని ప్రకటించారు. ఇలా శిక్షణా శిబిరాలపై రాళ్లు రువ్వడం ఇది రెండో సారి అని స్థానిక స్వయంసేవకులు పేర్కొంటున్నారు. మరోవైపు పోలీసులు అప్రమత్తమై.. ఈ శిబిరానికి రక్షణను ఏర్పాటు చేశారు.