హైదరాబాద్ బాల్ నగర్ లోని ఐడీపీఎల్ శివాలయంలో దుర్ఘటన జరిగింది. ఓ దుండగుడు శివాలంయలోకి చొరబడి అపవిత్రం చేశాడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోల ప్రకారం శివాలయంలోకి వెళ్లి, లింగాన్ని తొక్కుకుంటూ...కొన్ని వస్తువులను దొంగతనం కూడా చేశాడు.
ప్రాథమికంగా పోలీసు అధికారుల సమాచారం ప్రకారం..గాంధీ నగర్ లోని శివాలయంలో జరిగిన దొంగతనం కేసును తాము గుర్తించాం. సిటీ సీపీ ఆదేశాల ప్రకారం ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. DI జీడిమెట్ల, CCA బృందాలతో పాటు మొత్తం పది బృందాలను ఏర్పాటు చేశాం. 12 గంటల్లోనే అనుమానితులను విజయవంతంగా పట్టుకున్నాం. దొంగలించిన వస్తువులు నాగపడిగ, కలశం, శఠగోపం, దేవతా మూర్తులను స్వాధీనం చేసుకున్నాం. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం 196, 298, 299, 331, 335 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. నిందితులకు 14 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే అవకాశం వుంది. వారిని వెంటనే జ్యుడీషియల్ రిమాండ్ కి పంపుతున్నాం’’ అని పోలీసు అధికారి ప్రకటించారు.
ఇక.. ఈ నేరస్థులపై హత్యాయత్నం, ఆస్తి సంబంధిత నేరాల్లో పాల్గొన్నవారని, అలాగే మాదక ద్రవ్యాలకు కూడా బానిసలని తమ దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు.
మరోవైపు ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇలాంటివి కేవలం హిందూ దేవాలయాల విషయంలోనే ఎందుకు జరుగుతున్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ తెలంగాణలో ఇలాంటి ఘటనలనే జరిగాయని, వాటిపై కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు.