స్వయం ప్రకటిత క్రైస్తవ పాస్టర్ బజీందర్ సింగ్ వివాదాస్పదంగా ప్రవర్తించాడు. ఈయనకి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారుతోంది.
తన ఆఫీసులో వున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ… వాళ్లపై వస్తువులు విసిరేస్తూ హంగామా చేశాడు. అంతేకాకుండా ఓ యువకుడితో పాటు మహిళ పైనా చేయి చేసుకున్నాడు. ఇప్పుడు ఇదే వీడియో వైరల్ అవుతోంది. మొబైల్ విసిరి, పర్సుతో కొట్టడం ఈ వీడియోలో కనిపిస్తోంది. అంతేకాకుండా తన బిడ్డతో కార్యాలయానికి వచ్చిన మహిళపై దాడికి దిగాడు. చెంపదెబ్బలు కొట్టాడు. దీంతో అక్కడ వున్న వారికి, పాస్టర్ కి మధ్య తీవ్ర వివాదం రేగింది. మరోవైపు ఇతనిపై లైంగిక ఆరోపణల కేసు కూడా నమోదైంది.
లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ 22 ఏళ్ల యువతి కపుర్తలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2017 నుంచి 2023 వరకు తల్లిదండ్రులతో కలిసి ప్రార్థనా కేంద్రానికి వెళ్లామని, తన మొబైల్ నెంబర్ తీసుకొని, వేధించడం ప్రారంభించాడని పేర్కొంది. ఆదివారం నాడు తన కేబిన్ కి పిలిపించుకొని, ఒంటరిగా కూర్చోబెట్టేవాడని, చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడని పేర్కొంది. అయితే.. ఈ ఆరోపణలను పాస్టర్ తిరస్కరించాడు. ఇతర పాస్టర్లు తనను ఇరికించాలని చూస్తున్నారని పేర్కొన్నాడు.
మరోవైపు ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పంజాబ్ మహిళా కమిషన్ బాధితురాలి కుటుంబానికి భద్రత కల్పించాలని ఆదేశించింది.
Source: vskap