నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లన్నను రాష్ట్రీయ స్వయంసేవకసంఘ్ సర్సంఘచాలక్ మోహన్ భాగవత్ దర్శించుకున్నారు. శ్రీశైలం మహా క్షేత్రంలో గురువారం నుంచి ప్రారంభమైన ఉగాది మహోత్సవాల సందర్భంగా మల్లన్నను దర్శించుకున్నారు.
ఆలయ రాజ గోపురం వద్ద ఆయనకు ఆలయ ఈవో శ్రీనివాస రావు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మోహన్ భాగవత్ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ దేవికి కుంకుమార్చన చేశారు. అమ్మవారి ఆశీర్వాద మండపంలో మోహన్ భగవత్ గారిని శేష వస్త్రాలతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని ఆలయ ఈవో శ్రీనివాసరావు అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు.