సంస్కృత భాషకు నిలయమైన ఎన్ఎస్యూలో దైవభాషను అభ్యసిస్తున్న, అధ్యయనం చేస్తున్న విద్యార్థులు అదృష్టవంతులని బెంగళూరు డీఆర్డీఓ ప్రముఖ శాస్త్రవేత్త ఎల్ఎన్ రాఘవేంద్ర కొనియాడారు.
తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో వర్సిటీ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి, ప్రసంగించారు. సంస్కృతంలో నిక్షిప్తమైన భారతీయ సంస్కృతి ఆధునిక సమాజానికి మార్గదర్శిగా ఉందన్నారు. సంస్కృత భాష ఔన్నత్యం విశ్వవ్యాప్తం చేయాల్సిన బాధ్యత విద్యార్థులు, అధ్యాపకులపై ఉందన్నారు.
వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సంస్కృత అధ్యయన, అధ్యాపన విషయంలో ఉత్తమ జ్ఞానాన్ని విద్యార్థులకు, ప్రజలకు అందిస్తూ భారతీయ సంస్కృతిని, సంస్కృత భాషను సంరక్షిస్తూ ప్రాచీన భాషతో పాటు ఆధునిక సాంకేతిక విషయాలను వర్సిటీ విద్యార్థులకు నే ర్పిస్తూ ప్రగతి పథంలో నడుస్తోందన్నారు. అనంతరం పలు క్రీడా, సాంస్కృతిక పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్, కే వెంకటనారాయణరావు, డీన్లు సి దక్షిణమూర్తి శర్మ, సి రంగనాథన్, రజనీకాంత్ శుక్లా, అధ్యాపకులు నాగరాజు, ఉదయనా హెగ్డే, లీనాచంద్ర, సేతు రాం, వైష్ణవి, విద్యార్థులు పాల్గొన్నారు.