హిందూ ధర్మానికి మూల స్తంభాలైన సాధు సంతులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేంద్ర కుమార్ సింగ్ అవమానకర వ్యాఖ్యలు చేశారు. మహా మండేశ్వర్ తో పాటు సాధు సంతులను ఎద్దులతో పోలుస్తూ... వ్యాఖ్యలు చేశారు.
రాజేంద్ర కుమార్ సింగ్ మధ్యప్రదేశ్ లోని అమర్ పటన్ నుంచి శాసన సభకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక.. కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... ‘‘కాంగ్రెస్ వారు హిందూ విరోధులు. వారిది హిందూ వ్యతిరేక మనస్తత్వం. హద్దులు దాటిపోయింది’’ అంటూ అమిత్ మాలవీయ మండిపడ్డారు.
సాత్నా అనే ప్రాంతంలో కాంగ్రెస్ జిల్లా స్థాయి కార్యకర్తల కార్యక్రమం జరిగింది. దీనికి ఎమ్మెల్యే రాజేంద్ర కుమార్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''హిందుత్వాన్ని ప్రచారం చేయడానికి బీజేపీ సాధు సంతులను వినియోగించుకుంటోంది. రుషులను, సాధువులను, సంతులను, మహా మండలేశ్వరులను ప్రజల్లోకి పంపిది. బీజేపీని, హిందుత్వాన్ని ప్రోత్సహించాలని వారికి చెప్పింది. కానీ ఈ ఎద్దులు ఇతరుల పొలాల్లో మేస్తున్నాయి. భారత్ దేశ గుర్తింపులైన లౌకికవాదం, సామ్యవాదం, రాజ్యాంగ సంస్థల బలం అన్నీ శిథిలమవుతున్నాయి. ఇదో పెద్ద సవాలుగా పరిణమించింది. దీని నుంచి బయటికి రావడానికి కాగడాలు వెలిగించండి.’’ అని రాజేంద్ర కుమార్ సింగ్ అన్నారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అని బీజేపీ నేత విశ్వాస్ కైలాస్ సారంగ్ అన్నారు. హిందూ దేవతలను, సాధువులను, సనాతన ధర్మాన్ని అవమానించడం కాంగ్రెస్ కి అలవాటేనని అన్నారు. అయితే సాధువులను ఎద్దులతో పోల్చడం మాత్రం చాలా బాధాకరమని, అభ్యంతరకరమని అన్నారు. ఇటలీ సంస్కృతిలో ఎదిగి, ఎదిగి సాధువులను, సనాతన సంస్థలను అవమానించే కాంగ్రెస్ నేతలు ఇంతకు మించి ఏం మాట్లాడతారు? అంటూ ఎద్దేవా చేశారు.
Source: vskts