పశుదాణా కేసులతో పాటు అనేక కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మహా కుంభమేళాను అవమానిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కుంభమేళా అనేది పనికిరానిదని, దానికి అసలు అర్థమే లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహా కుంభమేళా అనేది చెత్త అని, అసలు దానికి అర్థమే లేదంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన రైల్వే స్టేషన్ ప్రమాదం గురించి స్పందిస్తూ... మహా కుంభమేళాను కూడా అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే దుర్ఘటన జరిగిందని రాజకీయ విమర్శలు చేశారు. ఇది సహజంగా జరిగే రాజకీయ విమర్శల క్రిందికే వస్తుంది. కానీ... అత్యంత పవిత్రమైన మహా కుంభమేళాపై విమర్శలు ఎందుకు చేశారు? అదో బక్వాస్.. (చెత్త) అంటూ అత్యంత అవమానకరంగా మాట్లాడటం ఏమిటి? ఈ విమర్శలను హిందూ సమాజం ఏమాత్రం క్షమించదు. ఇప్పటి వరకు 51.47 కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించారు. ఇంకా ఆచరిస్తూనే వున్నారు. వేలల్లో నాగ సాధువులు, సాధు సంతులు హరహర మహాదేవ్... అంటూ పుణ్య స్నానాలు చేస్తూ... పరవశులవుతున్నారు. ఇంతటి పుణ్యమైన కుంభమేళాను, హిందువుల శ్రద్ధాసక్తులను లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా అవమానించారు.