వికారాబాద్ జిల్లా నవాబు పేట మండలం చిట్టి గిద్ద గ్రామంలో వక్ఫ్ బోర్డు కలకలం రేపింది. గ్రామంలో ఉన్న హనుమాన్ దేవాలయానికి ఆనుకుని ఉన్న గుడి స్థలంలో గ్రామస్తులు శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన కోసం శివాజీ బోమ్మను ప్రతిష్టించారు.
శివాజీ బోమ్మ ఏర్పాటు అనంతరం గ్రామానికి చెందిన ముస్లీంలు అది వక్ఫ్ బోర్జు స్థలం అక్కడి నుండి బొమ్మను తొలగించాలని పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు పోలీసులు గ్రామస్తుల తో మాట్లాడి అక్కడి నుండి శివాజి బోమ్మను తొలగించాలని చెప్పడంతో వివాదం రాజుకుంది . గ్రామంలో వక్ఫ్ బోర్డుకు సంబందించి ఎలాంటి ఆస్తులు లేవని అందులోను హనుమాన్ ఆలయానికి ఆనుకుని ఉన్న స్థలములో శివాజి బోమ్మ పెట్టుకున్నామని, బొమ్మ తీసే ప్రసక్తే లేదని గ్రామస్తులు తేల్చి చెప్పడంతో పోలీసులు విగ్రహం వద్ద బందో బస్తు ఏర్పాటు చేశారు.
అధికార పార్టీ నకిలీ వక్ఫ్ బోర్డుకు వత్తాసు పలుకుతుంది...గ్రామస్తుల ఆరోపణ.
నవాబు పేట మండలంలో ఎక్కడ వక్ఫ్ బోర్డు ప్రస్తావన లేదని అలాంటిది మా గ్రామంలో కొత్తగా వక్ప్ బోర్డు ఏంటని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హనుమాన్ ఆలయ స్థలంలో ఏర్పాటు చేసుకున్న శివాజి బోమ్మ వల్ల గ్రామంలో ఎవరికి ఇబ్బంది లేదని ఒక వర్గం వత్తిడులకు లోంగిన అధికార పార్టీ నాయకులు లేని వక్ఫ్ బోర్డు ప్రస్తావన తీసుకు వచ్చి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. గతంలో చించల్ పేట గ్రామంలో వినాయక మండపాన్ని కూల్చారని ఇప్పుడు శివాజి విగ్రహం తొ లగించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు.