ఓంకారేశ్వర్ లోని నర్మదా నది ఒడ్డున వున్న మార్కండేయ ఆధ్రమంలో కుటుంబ ప్రబోధన్ కి సంబంధించిన అఖిల భారతీయ సమావేశం జరిగింది. సమారోప్ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ హాజరయ్యారు. వారి ప్రసంగ పూర్తి పాఠమిదీ...
‘‘భారత దేశ భూమి మనల్ని పోషిస్తుంది, రక్షిస్తుంది. సుసంపన్నం కూడా చేస్తుంది. భారత్ లో పుట్టిన ప్రతి వ్యక్తికీ సహజంగా సేవా అన్న సంస్కృతి వుంటుంది. భారత మాతను ఆరాధించడం అంటే భారతదేశంలో నివసించే ప్రజలు, భూమి, అడవులు, నీరు, జంతువులకు సే చేయడమే. మరియు రక్షించడమే. పర్యావరణం మరియు జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం, ప్రోత్సహించడమే. ఇవన్నీ భారత మాతను ఆరాధించడం ద్వారా మనకు ప్రేరణ లభిస్తుంది. ఏకాంతంలో ఆధ్యాత్మిక సాధన చేయండి. బహిరంగంగా మాత్రం సామాజిక సేవ చేయాలి.
గృహస్థాశ్రమ ధర్మం ఇరుసు లాంటిది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమాజ సేవ చేయడానికి మాత్రం సిద్ధంగా వుండాలి. గరుడుడు భరత మాతను సేవించి, భగవంతుడ్ని వాహనంగా మారే వరం ఎలా పొందాడో, అలాగే మనం కూడా భారతమాతను సేవించిన దాంతో మతానికి, ధర్మానికి వాహకంగా మారాలి. విశ్వం సృష్టించిన ప్రత్యేకమైన దానిలో భారతీయ కుటుంబం అన్నది ఓ ప్రత్యేక సృష్టి. భారతీయ కుటుంబాలను మరింత బలోపేతం చేసేందుకు కుటుంబ ప్రబోధన్ అన్న మాధ్యమంగా వివిధ రకాల పనులు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులను కలవడం, కుటుంబ సభ్యులతో చర్చలు చేసుకోవడం, కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి.
కుటుంబ ప్రబోధన్ అన్న కార్యకలాపం ద్వారా కుటుంబాన్ని పటిష్టంగా వుంచడానికి ఆరు రకాల ‘‘భ’’ లు ఉపయోగడతాయి. అవి భోజన్, (భోజనం) భజన్ (భజనలు), భాషా, భూషా, (వేషధారణ) భ్రమణ్, (సంచారం), భవన్... ఈ అంశాలపై పని చేయాల్సి వుంటుంది. అదే సమయంలో ప్రస్తుతం పిల్లల్లో కనిపించే వైకల్యాలకు అతిపెద్ద కారణం మొబైల్ ఫోన్లు. వీటిని ఎక్కువగా ఉపయోగించడమే. దీని విరుగుడు కోసం ప్రతి వ్యక్తీ తన కుటుంబంలో పరస్పర సంభాషణను పెంచుకోవాలి. తద్వారా ఇంటి పిల్లలు వారి మనస్సుల్లోని విషయాలను స్వేచ్ఛగా పంచుకుంటారు. దీంతో కుటుంబంలో సానుకూల వాతావరణం కచ్చితంగా ఏర్పడుతుంది.
కుటుంబ సాధికారతా కార్యకలాపాలను మాతృశక్తి చేస్తుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా రానున్న కాలంలో కుటుంబ ప్రబోధన్ విషయంలో మాతృశక్తి భాగస్వామ్యాన్ని మరింత పెంచాలి. ప్రపంచం అంతా ఒకే శరీరం. దాని ఆత్మ మన భారతదేశం’’ అని మోహన్ భాగవత్ ముగించారు.