మహా కుంభమేళాలో ప్రమాదం జరిగిన తర్వాత ఆరెస్సెస్ స్వయంసేవకులు తమ తమ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల్లో మునిగిపోయారు.
అత్యంత వేగంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు.స్వయంసేవకులు బృందాలుగా విడిపోయి, రవాణా ఏర్పాట్లు, పరిపాలనా అధికారులకు సహాయం చేస్తున్నారు. యాత్రికుల కోసం కొన్ని స్థలాల్లో దుకాణాలను కూడా ప్రారంభించారు.సెక్టార్ 9 దగ్గర వుండే కలాష్ ద్వారం, సెక్టార్ 7 దగ్గర వుండే సూర్య ద్వారం దగ్గర ట్రాఫిక్ క్లియర్ చేయడంలో కూడా స్వయంసేవకులు మునిగిపోయారు.
శ్యామా ప్రసాద్ ముఖర్జీ నగర్ కి చెందిన స్వయంసేవకులు మహా కుంభమేళా ప్రాంతం యొక్క ఉత్తర ద్వారం అని పిలువబడే ఫఫమౌలోని బేలా కచర్లో భండార్ ను నిర్వహించారు. యాత్రికులకు స్వయంసేవకులు భోజనం అందించారు. కుంభమేళా ప్రాంతంలోని మరో ద్వారం దారాగంజ్, సుబేదర్ గంజ్ లోని రజ్జుభయ్యా నగర్ లో స్వయం సేవకులు యాత్రికుల కోసం టీ, బిస్కెట్లు, ఆహార ప్యాకెట్లు అందజేశారు.అలాగే పరిపాలనా అధికారులకు కూడా స్వయంసేవకులు సహాయం చేస్తూ, ట్రాఫిక్ నియంత్రణలో కూడా చూసుకుంటున్నారు.
మరోవైపు ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించడం, వారికి చికిత్స అందేట్లు కూడా స్వయంసేవకులు చూస్తున్నారు. మరోవైపు సాధు సంతులు కూడా భక్తులకు తగు సూచనలు చేశారు. యాత్రికుల సంఖ్య తగ్గిన తర్వాతే చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు పుణ్య స్నానాలు ఆచరించడానికి రావాలని సూచించారు.