Bharatiya Akhara Parishad |
మహా కుంభమేళాలో హైందవేతరులు ఎలాంటి దుకాణాలూ పెట్టుకోవడానికి వీల్లేదని, ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ అఖాడా పరిషత్ చీఫ్ రవీంద్ర పూరీ డిమాండ్ చేశారు. టీ స్టాల్స్ గానీ, జూస్ సెంటర్స్ గానీ, పూల దుకాణాలు గానీ హైందవేతరులు పెట్టుకోవడానికి అనుమతులు ఇవ్వొద్దని, వారికి అవకాశమిస్తే... అనుచితంగా ప్రవర్తిస్తారన్నారు.
ఉమ్మి వేడయమో, మూత విసర్జనమో చేస్తారని అన్నారు. ఇలాంటి ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల సందేశాన్ని పంపుతాయన్నారు. మహా కుంభమేళా అత్యంత పవిత్రంగా, దైవికంగా, శుభ్రంగా, గొప్పగా వుండాలని ఆయన ఆకాంక్షించారు. మహాకుంభ మేళా పవిత్రతను కాపాడడానికి హైందవేతరులను చాలా దూరం పెట్టాలన్నారు. ఇది అత్యంత ముఖ్యమైన అంశమని నొక్కి చెప్పారు.