ప్రయాగ రాజ్ వేదికగా మహాకుంభ మేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఎనిమిది రోజుల వరకు 8 లక్షలకు పైగా మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. అలాగే విదేశీయులు కూడా సనాతన ధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు. మరోవైపు వాల్మీకి రామాయణం ఆధారంగా జపాన్ ఇండో సంయుక్త భాగస్వామ్యంతో రూపొందించిన యానిమేషన్ చిత్రం ‘‘రామాయణ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’’ ప్రదర్శనను మహా కుంభమేళాలో వేయనున్నారు. ఈ విషయాన్ని ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ప్రకటించింది.
జనవరి 23వ తేదీన ఈ స్పెషల్ స్కీనింగ్ నిర్వహిస్తు్న్నామని, విద్యార్థులు, భక్తులు అంతా ఆహ్వానితులేనని ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది. రామాయణం గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఉన్న చిన్నారులకు ఈ చిత్రం చక్కటి అనూభూతినిస్తుందని తెలిపింది. ప్రయాగ్‌రాజ్‌లోని నేత్రకుంభ్ సమీపంలో ఉన్న సెక్టార్ 6 దివ్వ ప్రేమ శిబిర్‌లో ప్రత్యేక స్క్రీనింగ్ బుధవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభవుతుందని వివరించింది.
1993లో జపాన్, ఇండియా ఫిలిం మేకర్స్ కలిసి ‘రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్’ అనే యానిమేషన్ సినిమా తీసిన సంగతి తెలిసిందే. మన రామాయణం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. జపాన్ లో 1997లో ఈ సినిమా రిలీజయింది. అక్కడి టీవీలలో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయింది.హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లీన్ వెర్షన్లలో యానిమే ఫిల్మ్‌గా ఈ చిత్రం విడుదలవుతుండటం విశేషం. గ్రీక్ పిక్చర్ ఇండియా, ఏఏ ఫిల్మ్స్, ఎక్సెల్ ఎంట్టైన్మెంట్ ఈ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరిస్తున్నారు.