కల్వరి టెంపుల్ పై ఏపీ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని కల్వరి టెంపుల్ చర్చిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో దానిని కూల్చేయాలని ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖ కీలక ఉత్తర్వులిచ్చింది. అవసరమైన అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు చేస్తున్నారని, అందుకే చట్టపరంగా కూల్చివేత కొనసాగుతుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
గుంటూరు వసంతరాయపురంలో వుండే ఓ వ్యక్తి చర్చిపై ఐదు ఆరోపణలు చేస్తూ నవంబర్ 2024 లో పీఎంవో కార్యాలయంలో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో చర్చి అక్రమ కార్యకలాపాలు, పంచాయతీరాజ్, రెవిన్యూ, పోలీస్ శాఖ, శబ్ద కాలుష్య నియంత్రణ మండలి వంటి కీలకమైన శాఖల అనుమతులే లేవని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కల్వరి చర్చిపై ఏపీ ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది.
హైదరాబాద్ కి చెందిన పాస్టర్ డాక్టర్ సతీష్ కుమార్ నేతృత్వంలోని చర్చి పన్నులు చెల్లించడం లేదని, అలాగే దశమ భాగాలుగా పెద్ద మొత్తంలో వసూళ్ల దందా చేస్తున్నారని కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా పేదలకు కిరాణా సామాను అందిస్తూ... తప్పుడు బోధనలను ప్రచారం చేస్తున్నారని అలాగే హిందువులను క్రైస్తవులుగా మార్చేస్తున్నారని కూడా పేర్కొన్నారు.ఈ దరఖాస్తును, ఫిర్యాదును అనుసరించే దర్యాప్తు జరిగింది. అలాగే కూల్చివేత్త ఉత్తర్వులు కూడా వచ్చాయి.
ఆ కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు పి. సతీష్ కుమార్. ఆసియాలోనే పెద్ద చర్చి ఇది అంటూ నడిపిస్తున్నాడు. 2005 లో దాదాపు 20 మందితో ప్రారంభమై, ఇప్పుడు మొత్తం 4 లక్షల మంది సభ్యులుంటారు. ఏ కార్యక్రమం జరిగినా 20 వేల మంది హాజరవుతుంటారు.ఓ వైపు మత ప్రచారం చేస్తూనే... సేవ అన్న ముసుగులో కల్వరి హాస్పిటల్, కల్వరి బైబిల్ కళాశాల,కల్వరి పాఠశాలలంటూ కూడా నిర్వహిస్తున్నాడు. క్రైస్తవ వర్గంలో సతీష్ కుమార్ అత్యంత పలుకుబడి కలిగిన పాస్టర్. అంతర్జాతీయంగా కూడాపేరుంది. అయితే ఏపీలో మాత్రం అత్యంత ప్రభావశీలుడిగా చెలామాణి అవుతున్నాడు.
దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, అమెరికాలోని చర్చిలను సందర్శిస్తూ.. తన ప్రచార కార్యకలాపాలను నిర్వహిస్తాడు. హైదరాబాద్ లోని కల్వరి టెంపుల్ ప్రతి నెలా దాదాపుగా 3 వేల మందిని క్రైస్తవులుగా మార్చేస్తోంది. అంతేకాకుండా భూ చట్టాలను ఉల్లంఘించడం, అన్ని నిబంధనలను తుంగలో తొక్కి కొత్త చర్చిల ఏర్పాటు, మోసపూరిత ఒప్పందాల ద్వారా భూములను ఆక్రమించడం అన్న దానికి కేరాఫ్ గా కల్వరి టెంపుల్ చర్చి నడుస్తోంది.
సతీష్ కుమార్ 2018 లో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ను కూడా కలుసుకున్నాడు. భారత్ లోని హైదరాబాద్ కల్వరి టెంపుల్ చర్చి పాస్టర్ సతీష్ కుమార్ ని కలవడం స్ఫూర్తిదాయకమంటూ చెప్పుకొచ్చాడు. డా. డేవిడ్ జెరెమియా, డాక్టర్. జాన్ అంకెర్బర్గ్, స్టీవ్ గ్రీన్, మార్ట్ గ్రీన్ మరియు డాక్టర్. జెర్రీ జాన్సన్లతో సహా ఇతరులతో మత స్వేచ్ఛను రక్షించే విషయంలో చర్చించామని కూడా పేర్కొన్నారు.
Courtesy : vskts