యూపీ ముఖ్యమంత్రి సీఎం యోగి మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంలు, కేబినెట్ మంత్రివర్గం కూడా పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ పుణ్య స్నానం ఆచరించే సమయంలో ఆనందం పొందామని, అనుభూతి కూడా పొందామని, వాటిని వర్ణించలేమని డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య అన్నారు.మరోవైపు అంతకు పూర్వం యూపీ కేబినెట్ సమావేశం కూడా కుంభమేళా ప్రాంతంలోనే జరిగింది. దీనికి సీఎం యోగి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. అలాగే మహా కుంభమేళా ఏర్పాట్లు, కుంభమేళాపై రివ్యూ కూడా జరిగింది.