యూపీలోని బరేలీ ప్రాంతంలో పురాతన దుర్గా దేవాలయంపై ముస్లిం ఛాందసులు 786, అల్లా రాసి వెళ్లిపోయారు. దీంతో హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తెలియగానే హిందువులు ఘటనా స్థలికి చేరుకొని, భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
786, అల్లాహ్ అంటూ దేవాలయం గోడలపై రాతలు రాసి, హిందువుల మనోభావాలు దెబ్బతీశారని దేవాలయ అర్చకుడు మండిపడ్డారు. మరోవైపు పోలీసులు కూడా రాతలను తొలగించి, దేవాలయానికి రంగులు వేయించారు. అయితే దేవాలయం దగ్గర సీసీ టీవీలను ఏర్పాటు చేయకపోవడంతో దుండుగులను గుర్తించడం ఆలస్యమవుతోంది. దీంతో నిందితులను గుర్తించేందుకు పోలీసులు ఆలయం చుట్టుపక్కల భవనాలపై అమర్చిన సీసీ టీవీలను పరిశీలిస్తున్నారు.