26 trains from Telugu states for Kumbh Mela |
ప్రయాగ్రాజ్లో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 28 వరకు 45 రోజుల పాటు జరగనున్న మహా కుంభమేళాకు యూపీ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ కుంభమేళాలో 45 కోట్ల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
తాజాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వెళ్లేవారి కోసం అదనంగా మరో 26 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ టౌన్; తెలంగాణలోని సికింద్రాబాద్, మౌలాలి జంక్షన్, వికారాబాద్ స్టేషన్ల నుంచి నడుస్తాయని తెలిపింది.
జనవరి 14 నుంచి ఫిబ్రవరి 27 వరకు పలు తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఆయా స్టేషన్ల నుంచి బయలుదేరుతాయని పేర్కొంది. జనవరి 14న రాత్రి 11 గంటలకు గుంటూరు- అజమ్గఢ్, జనవరి 16న రాత్రి 7.45 గంటలకు అజమ్గఢ్-విజయవాడ, ఫిబ్రవరి 5న రాత్రి 10 గంటలకు మచిలీపట్నం-అజమ్గఢ్, ఫిబ్రవరి 7న రాత్రి 7.45 గంటలకు అజమ్గఢ్-మచిలీపట్నం, ఫిబ్రవరి 15న సాయంత్రం 5.50 గంటలకు మౌలాలీ-గయ, ఫిబ్రవరి 17న రాత్రి 11.55 గంటలకు మౌలాలి-బనారస్ రైళ్లు నడుస్తాయి.
ఫిబ్రవరి 20న రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్-అజమ్గఢ్, ఫిబ్రవరి 22న రాత్రి 7.45 గంటలకు అజమ్గఢ్-విజయవాడ, ఫిబ్రవరి 19న రాత్రి 7.15 గంటలకు బనారస్-మౌలాలీ, ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 3.45 గంటలకు వికారాబాద్-గయ, ఫిబ్రవరి 20న రాత్రి 7.45 గంటలకు గయ- వికారాబాద్, ఫిబ్రవరి 5న రాత్రి 7.20 గంటలకు విజయవాడ-గయ, ఫిబ్రవరి 7న రాత్రి 7.45 గంటలకు గయ-విజయవాడ రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఫిబ్రవరి 8న మధ్యాహ్నం 2.30 గంటలకు కాకినాడ టౌన్-గయ, ఫిబ్రవరి 10న మధ్యాహ్నం 2.15 గంటలకు గయ-విజయవాడ, ఫిబ్రవరి 22 సాయంత్రం 4.45 గంటలకు కాచిగూడ-పట్నా, ఫిబ్రవరి 24న సాయంత్రం 5 గంటలకు పట్నా-కాచిగూడ, ఫిబ్రవరి 7న సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్-పట్నా, ఫిబ్రవరి 9న మధ్యాహ్నం 3.30 గంటలకు పట్నా-సికింద్రాబాద్ నుంచి ఈ రైళ్లు బయలుదేరుతాయని తెలిపింది.