ఉగ్రవాది అంతిమ యాత్రకి ఇంత జనమా?
కోయంబత్తూరు 1998 వరుస పేలుళ్ల వెనక సూత్రధారి ఎస్.ఏ.బాషా అంతిమ యాత్రకి వేలాది మంది తరలిరావడం చర్చకు దారితీసింది.
నిషేధిత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ ఉమ్మా వ్యవస్థాపకుడు బాషా. కోయంబత్తూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే ఉగ్రవాది అంతిమ యాత్రికి రాజకీయ ప్రముఖులు, ఇస్లామిక్ సంస్థల ప్రతినిధులు, స్థానికులు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఫిబ్రవరి 14న కోయంబత్తూర్‌ను వణికించిన 1998 పేలుళ్లలో 58 మంది మృతి చెందగా, 231 మందికి పైగా గాయపడినందుకు బాషా జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు ఎల్.కె. అద్వానీ నగర పర్యటన సందర్భంగా ఆయనను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు ప్రణాళిక రచించాడు.
ఈ మధ్య అనారోగ్యం పాలవడంతో చికిత్స కోసం బాషాకి పెరోల్ మంజూరైంది. చికిత్స పొందుతూ మరణించాడు. దక్షిణ ఉక్కడంలోని అతని నివాసం నుండి మధ్యాహ్నం 3:15 గంటలకు అంత్యక్రియల ఊరేగింపు ప్రారంభమై హైదర్ అలీ టిప్పు సుల్తాన్ సున్నత్ జమాత్ మసీదుకు చేరుకుంది. సాయంత్రం 4:30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు.నామ్ తమిళర్ కట్చి (NTK) చీఫ్ కోఆర్డినేటర్ సీమాన్, విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) ఉప ప్రధాన కార్యదర్శి వన్ని అరసు, మణితనేయ మక్కల్ కట్చి ప్రధాన కార్యదర్శి మరియు మనప్పారై ఎమ్మెల్యే పి. అబ్దుల్ సమద్ సహా ప్రముఖ నాయకులు,మరియు కొంగు ఇలైంజర్ పేరవై అధ్యక్షుడు యు. తనియరసు, బాషా నివాసంలో ఉన్నట్లు సమాచారం. అంత్యక్రియలకు వివిధ ఇస్లామిక్ సంస్థల నాయకులు కూడా హాజరయ్యారు.
ఇక... పోలీసులు కూడా భారీ భద్రతను కల్పించారు.ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)కి చెందిన రెండు కంపెనీలు మరియు తమిళనాడు స్పెషల్ పోలీస్ IV బెటాలియన్‌కు చెందిన మూడు కంపెనీల మద్దతుతో దాదాపు 1,500 మంది పోలీసు సిబ్బంది ఊరేగింపు సమయంలో శాంతిభద్రతల కోసం మోహరించారు.
ఇంతకు పూర్వం బీజేపీతో సహా ఇతర జాతీయవాద సంస్థలు అంత్యక్రియల ఊరేగింపుకు అనుమతి నిరాకరించాలని అధికారులకు వినతి పత్రం సమర్పించారు. దోషిగా తేలిన ఉగ్రవాది అంతిమయాత్రకి ఊరేగింపు అనేది ప్రమాదకరమని హెచ్చరించారు.