క్రైస్తవ ప్రార్థనలు |
హసన్ పర్తిలోని టీజీఆర్ జేసీ కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా క్రైస్తవ ప్రార్థనలు జరిగాయి. గురువారం రోజు రాత్రి క్రైస్తవ పాస్టర్లు కాలేజీలోకి యదేచ్ఛగా చొరబడి, ప్రచారం చేస్తూ, ప్రార్థనలు చేశారు. అంతేకాకుండా విద్యార్థులను బలవంతంగా మతం మారడానికి ప్రోత్సహించారు. ఇవన్నీ కూడా కళాశాల ప్రిన్సిపాల్ ఇందుమతి ఆధ్వర్యంలో, ఉద్దేశపూర్వకంగానే జరిగాయి. మరోవైపు కళాశాల ప్రధాన ద్వారానికి క్రైస్తవ చిహ్నాలు ఏర్పాటు చేయడం, విద్యార్థులకు బైబిల్ పంపకం కూడా జరిగినట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై విశ్వహిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వరంగల్ సిటీ పోలీసు కమిషనర్ కి ప్రిన్సిపాల్ పై ఫిర్యాదు చేసింది. క్రైస్తవ ప్రార్థనలకు హాజరు కాని విద్యార్థులు, అధ్యాపకులపై కక్ష పెట్టుకుంటన్నారని, 21 సంవత్సరాలుగా ప్రిన్సిపాల్ గ ఇదే కళాశాలలో పనిచేస్తూ, కళాశాలను మత మార్పిడి కేంద్రంగా తయారు చేశారని వీహెచ్ పీ ఆరోపించింది. ఎస్సీ నుంచి క్రిస్టియన్ లోకి కన్వర్ట్ అయిన ఇందుమతి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగాన్ని సంపాదించారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని వీహెచ్ పీ డిమాండ్ చేసింది.
Courtesy: vskts