హేతువాదం, దేవుడిపై విశ్వాసమే లేని పునాదులు ఆ పార్టీవి. తమకు అసలు దేవుడంటేనే గిట్టదని, తాము పరమ నాస్తికవాదులమని చెప్పుకున్న సంప్రదాయం వారిది. ఎప్పుడు చూసినా... హిందువుల సంప్రదాయాలు, మనోభావాలపై దాడికి దిగడమే.
రాముడే లేడు, రామ సేతువే లేదు... రామ మందిరంపై విషం కక్కడం... ఇలా వారి రికార్డు పెద్ద స్థాయిలోనే వుంది. ఇప్పటికే మీకు అర్థమైపోయి వుంటుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నామో.. డీఎంకే పార్టీ గురించి. ఇంత మాట్లాడిన డీఎంకే హఠాత్తుగా ఓ విషయాన్ని కక్కేసింది. ఇన్ని రోజులుగా హిందూ సమాజ ఏదైతే అనుకుందో.. ఆ విషయాన్ని సీఎం స్టాలిన్ వారసుడు, హిందుత్వంపై విషం కక్కే వ్యక్తి, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెప్పేశారు. తాను పరిపూర్ణ క్రిస్టియన్ అని ప్రకటించేసుకున్నాడు. పైగా ‘‘క్రైస్తవుడిగా గర్విస్తున్నాను’’ అంటూ కాలర్ ఎగరేసినంత పనిచేశారు.
అయితే.. తాను మత సామరస్యాన్ని గౌరవిస్తానంటూ మళ్లీ సన్నాయి నొక్కులు నొక్కారు. అన్ని విశ్వాసాలను కలుపుకొని ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చారు. క్రిస్మస్ వేడుకలకు హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.విభజన, విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి కొందరు మతాన్ని వాడుకుంటారన్నారు. ‘‘గత యేడాది ఓ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నేను క్రైస్తవుడినని గర్వంగా చెప్పాను. చాలా మంది వ్యతిరేకించారు. కానీ ఈ రోజు మళ్లీ చెబుతున్నా. నేను క్రిస్టియన్ గా గర్వపడుతున్నా.’’ అని ప్రకటించుకున్నారు. తనని క్రైస్తవుడని అనుకుంటే నేను క్రైస్తవుడ్ని, ముస్లిం అనుకుంటే ముస్లింని, హిందువును అనుకుంటే హిందువునే. తాను అందరికీ వర్తిస్తానని, అన్ని మతాలపై సమాన ప్రేమను చూపిస్తానంటూ చెప్పుకొచ్చారు.
అన్ని మతాలపై సమాన ప్రేమను కురిపిస్తే, మత సామరస్యాన్ని గౌరవిస్తానని చెప్పుకుంటే మొన్నటికి మొన్న హిందువులపై ఎందుకు విషం కక్కారో చెప్పాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. ‘‘సనాతన ధర్మం అనేది ఓ రోగం. ఆ ధర్మాన్ని నిర్మూలించాలి.సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకంగా ఉంటుందని అన్నాడు. కొన్నింటిని మనం కేవలం వ్యతిరేకించి ఊరుకోకూడదు.. వాటిని మనం నిర్మూలించాలి.. డెంగ్యూ, దోమలు, మలేరియా, కరోనా వంటి వాటిని వ్యతిరేకిస్తే సరిపోదు.. నిర్మూలించాలి.. అలానే మనం సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలి’’ అని వ్యాఖ్యానించాడు.