ప్రయాగ్ రాజ్‌లో జరగబోయే మహాకుంభమేళా ప్లాస్టిక్ రహిత మహా కుంభమేళాగా జరగనుంది. దీనికి అందరూ సహకరించాలని ఇప్పటికే ప్రభుత్వం పిలుపునిచ్చింది.
ఇందులో భాగంగా పర్యావరణ అనుకూల మహా కుంభమేళాను నిర్వహించే దిశగా ‘‘వన్ థాలీ వన్ థైలా’’ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో భాగంగా ఉదయ్ పూర్ నుంచి 14,500 స్టీల్ ప్లేట్లు మరియు బట్ట సంచుల వాహనం కుంభమేళాకి బయల్దేరింది.పర్యావరణ సంరక్షణ గతివిధి నేతృత్వంలో ఈ ప్రచారం జరుగుతోంది.
రాబోయే కుంభమేళాను ప్లాస్టిక్ రహిత కుంభమేళా జరపాలని లక్ష్యంగా పెట్టుకుంది. సింగిల్ యూస్ ప్లాస్టిక్ స్థానంలో స్టీల్ ప్లేట్లు, బట్ట సంచులను వాడాలని ప్రత్యామ్నాయాలను చూపించింది. మహా కుంభమేళాకి దాదాపు 40 కోట్ల మంది హాజరవుతారని అంచనా. ప్లాస్టిక్ వ్యర్థాలను అనుమతిస్తే 40,000 టన్నుల వ్యర్థాల ఏర్పాటై, పర్యావరణంపై ప్రభావాన్ని చూపే ప్రమాదం వుందని అంచనా వేశారు.
ఈ ప్రమాదం నుంచి బయట పడేందుకు పర్యావరణ సంరక్షణ గతివిధి వన్ థాలీ వన్ థైలాను ముందుకు తెచ్చింది. ఇందులో భాగంగా ఉదయ్ పూర్ లో ఆరెస్సెస్ కార్యాలయం నుంచి స్టీల్ ప్లేట్, బట్ట సంచులతో కూడిన వాహనం ప్రయాగ రాజ్‌కి బయల్దేరింది. ఇందు కోసం ఇతరులు కూడా తమ ప్రయత్నాలను ప్రారంభించారు.