Mamata Banerjee's Cabinet Minister Firad Hakim Says Muslims will soon become majority |
అల్లా దయవలన త్వరలో ఈ దేశంలో ముస్లింలు మెజార్టీ గా అవుతారు.
ఫిరాద్ హకీమ్, మమతా బెనర్జీ కేబినెట్ లో మంత్రి గా మరియు, కలకత్తా మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గా కూడా చేస్తున్నారు. హకీమ్ కలకత్తా లో ఒక మైనారిటీ విద్యార్థుల సభలో మాట్లాడుతూ " ప్రస్తుతం బెంగాల్ లో మనం 33% వున్నా దేశ వ్యాప్తంగా ఇంకా 17%మాత్రమే ఉన్నాం. అందుకే మనల్ని మైనార్టీ సమూహం అంటున్నారు. అయితే రాబోయే రోజుల్లో మనం మైనారిటీలుగా మిగిలిపోము. అల్లా మనపై దయ ఉండి, విద్య మనతో ఉంటే మనం మెజారిటీ అవుతామని మనం నమ్ముతున్నాము, ”అని హకీమ్ చెప్పారు.
న్యాయవ్యవస్థ లో మన భాగస్వామ్యం బాగా తక్కువగా ఉంది అని అది పెరిగితే కొవ్వొత్తి ప్రదర్శనలు చేసే అవసరం ఉండదు. మన మాటే అంతా వింటారు అని చెప్పారు.
ఈ తృణమూల్ సీనియర్ నాయకుడి వ్యాఖ్యలు వివాదానికి దారితీయడం ఇదే మొదటిసారి కాదు. ఈ సంవత్సరం జులైలో, ఇస్లాంలో పుట్టని వారు దురదృష్టవంతులని చెప్పడంతో పెద్ద దుమారం రేగింది.
“ఇస్లాంలో పుట్టని వారు దురదృష్టవంతులు. మనం వారిని ఇస్లాం ధర్మం కిందకు తీసుకురావాలి. మనం అలా చేస్తే అల్లా సంతోషిస్తాడు, ”అని మిస్టర్ హకీమ్ జూలై 3న ‘ఆల్ ఇండియా ఖురాన్ కాంపిటీషన్’ సందర్భంగా చెప్పారు.
ఈ వ్యాఖ్యలు మీద హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం చెప్పడంతో హకీమ్ మాట్లాడుతూ ఎవరినీ నొప్పించడం తన ఉద్దేశం కాదని క్షమాపణ చెప్పాడు.
ఇటువంటి వ్యాఖ్యలు యే బీజేపీ మినిస్టర్ చేసి ఉంటే ఎర్ర విమర్శలు చాలా ఎక్కువగా వినపడేవి.
చాడా శాస్త్రి....