ఆరెస్సెస్, ఇతర హిందూ ధర్మ సంస్థల గ్రూపులే లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేసిన అనుమానిత ఇస్లామిక్ ఉగ్రవాదులను అసోం ఏటీఎస్ అరెస్ట్ చేసింది. కేరళ, బెంగాల్, అసోంలో ఏటీఎస్ పోలీసులు ఏక కాలంలో రెండు రోజుల పాటు దాడులు నిర్వహించారు.
ఈ ఆపరేషన్ కి ‘‘ప్రఘట్’’ అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా ఎనిమిది మంది ఇస్లామిక్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. కేరళలో అరెస్టైన వారిలో అల్ ఖైదా అనుబంధంగా వున్న ఇస్లామిక్ ఉగ్రవాది ఎండీ సాద్ రాడి అకా ఎండీ షాబ్ సేఖ్ వున్నాడు.
ఇక.. మినారుల్ షేక్, ఎండీ అబ్బాస్ అలీ, నూర్ ఇస్లాం మండల్, అబ్దుల్ కరీం మండల్, ముజీబర్ రెహ్మాన్, హమీదుల్ ఇస్లాం, ఇనాముల్ హక్ గా గుర్తించామని ఏటీఎస్ పేర్కొంది. దేశంలో మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టి, మత సామరస్యానికి భంగం కలిగించాలని చూస్తున్నారని అసోం స్పెషల్ డీజీపీ హర్మీత్ సింగ్ తెలిపారు. వీరి నుంచి కొన్ని కీలక పత్రాలు, వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు కేరళ మరియు బెంగాల్లో నివసిస్తున్న ఈ ఉగ్రవాదులు అల్‌ఖైదా ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్న మహ్మద్ ఫర్హాన్ ఇస్రాక్ కోసం పనిచేస్తున్నట్లు తాము గుర్తించామని ఏటీఎస్ తెలిపింది.