తమ దేశ చరిత్రను వలసవాదుల కళ్లజోడు నుంచి కాక దేశీయులమైన తమ దృష్టికోణంతో చూసి, రాసుకోవాలన్న తపన ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో పెరుగుతోంది.
ముఖ్యంగా, గతంలో సామ్రాజ్యవాదుల ఆక్రమణకు గురై, పోరాడి స్వాతంత్ర్యాన్ని సాధించుకున్న దేశాలు ఆ భావదాస్యం నుంచి బయటపడాలని ఎంతగా ప్రయత్నిస్తున్నాయో, అంతగా ప్రతిఘటనను ఎదుర్కోవడం విచిత్రం. ఈ క్రమంలోనే అమెరికాలోని షానీ స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ లావణ్యా వేమసాని ఇటీవలే కొన్ని అధ్యాయాలను రచించి, మొత్తం పుస్తకాన్ని ఎడిట్ చేసి ప్రచురించిన ‘హ్యాండ్ బుక్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ’లో భారతీయ చరిత్రకు సంబంధించిన నూతన సంచలనాత్మక పరిశోధనలతో కూడిన 21 అధ్యాయాలు ఉన్నాయి.
ఈ పుస్తకం విడుదలైనప్పటి నుంచి, ముస్లిం దృక్కోణం నుంచి భారతీయ చరిత్రను తిరిగి చెప్పనందుకు ప్రొఫెసర్ లావణ్య వేమసానిపై ఉదారవాదులమని చెప్పుకునే అసహనవాద విద్యావేత్తలు, యాక్టివిస్టులు విరుచుకుపడ్డారు. ముఖ్యంగా లావణ్య ఈ పుస్తకం గురించి సోషల్ మీడియాలో ప్రకటించడమేమిటి, ఇస్లామిక్ స్టడీస్‌లో విశిష్ట అధ్యయనాలు చేసిన విదేశీ విద్యావేత్తలు, శ్వేతజాతీయులైన విదేశీయులు ఆమెపై దాడి చేశారు. ఇప్పటికే ప్రధాన లోనూ పుష్కలంగా వక్రీకరించిన ఉదంతాలు, ఏరిఏరి పెట్టుకున్న అధ్యాయాలు, అత్యాచారాలపై ముసుగువేసిన మరీ రచించి ఉన్నప్పటికీ వారికి ఇది నచ్చలేదు.
ముష్కర ఇస్లామిక్ దాడులు, అవి చేసిన క్రూర చక్రవర్తుల దృక్కోణం నుంచి భారత చరిత్రను తిరిగి చెప్పనందుకు, దేశీయులనే అంటే హిందువులనే ఆ పుస్తకంలో ప్రధాన విషయాంశంగా చేసినందుకు భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ సమగ్రతపైనే వారు దాడి చేశారు. వలసవాద ‘దక్షిణాసియాలో ఇస్లాం’పై అధ్యయనం చేసి, బోధన చేస్తున్న బ్రాసన్ ఇన్ఫ్రామ్ అనే మేధావి, భారతదేశ వాస్తవ చరిత్రలో ఆక్రమణదారుల గురించి తక్కువగా ఉండటం గురించి ఆవేదన వ్యక్తం చేశాడు. అందులో ఇస్లాం లేదా ముస్లింలపై ఒక్క అధ్యాయం కూడా లేదని, మొత్తం 507 పేజీలున్న ఈ పుస్తకంలో ఇస్లాం అనే పదం కేవలం ఐదు సార్లు, ముస్లింలు అనే పదం 9సార్లు వచ్చిందని ఆరోపించడమే కాదు, ఇది నిర్లక్ష్యమా లేక దక్షిణ ఆసియా అధ్యయనపు హిందుత్వీకరణా? అంటూ ప్రశ్నించాడు.
మరొక శ్వేతజాతీయ ప్రొఫెసర్, ఇస్లామిక్ స్టడీస్ బోధించే ఎసి బ్రౌన్ అయితే యూనివర్సిటీలో తన క్లాసుల్లో ఆ పుస్తకాన్ని ఉపయోగించనని ప్రకటించేశాడు. ఇది 1100-1800 సం|| వరకు లేదా 1/4 జనాభా గురించి విస్మరిస్తే ఇది చాలా మంచిపుస్తకం… ముఖ్యంగా మీరు హిందూ జాతీయవాది అయితే ఇంకా అంటూ వ్యంగ్యోక్తులు పోయాడు.
‘హ్యాండ్ బుక్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ’ పుస్తకం, ముస్లిం కథనాన్ని గణనీయంగా విస్మరించిందని ఇస్లామిక్ స్టడీస్ పై ఆసక్తి కలిగిన మరొక పరిశోధకుడు ముఫీద్ యుక్సెల్ బాధపడ్డాడు. కాగా, ఈ ఇదంతా దేశీయ చరిత్రలో పరిశోధన చేయాలనుకునే వారిని బెదిరించే కార్యాచరణ పద్ధతిలో భాగమేనని, అందుకే మ్లేచ్చుల ప్రభావంలేని ప్రొఫెసర్ లావణ్య వేమసానిని లక్ష్యంగా చేసుకున్నారు అని విశ్లేషకులు భావిస్తున్నారు.