కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టానికి సవరణలు |
ప్రస్తుతం మనం బ్యాంక్ అకౌంట్స్ లో కానీ బ్యాంక్ లాకర్లకి కానీ నామినేషన్ ఇవ్వదల్చుకుంటే బ్యాంకుల్లో ఒక పేరే ఇవ్వవలసి వస్తోంది.
ఈ రూల్ వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఒకరికి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఏ ఒక్కరి పేరు మీద నామినేషన్ ఇస్తే ఖాతాదారుడు చనిపోయిన తర్వాత ఆ నామినేషన్ డబ్బులు మిగతా వారితో షేర్ చేసుకోవడం అనేది ఈ నామినేషన్ పొందిన వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా ఒక ఖాతాదారుడు కి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండి ఏ ఒక్కరి పేరో నామినేషన్ ఇచ్చి కుటుంబం లో బయటకు ప్రకటిస్తే, మిగతా పిల్లలతో ఇబ్బందులు రావచ్చును. దీని వల్ల పలు కుటుంబాల్లో కుటుంబ సభ్యులు మధ్య గొడవలు ఆపై కోర్టులకు పోవడం వరకు జరుగుతోంది.
అందుకని, ఈ ఇబ్బందులను అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టానికి సవరణలు చేస్తూ నిన్న పార్లమెంటు లో బిల్ పాస్ చేసింది. కొత్త రూల్స్ ప్రకారం..
నామినేషన్ క్రింద నాలుగు పేర్లు ఇవ్వవచ్చు.
మళ్ళీ ఆ నాలుగు పేర్లలో...ఈ క్రింది విధంగా ఇవ్వవచ్చు.
Either or Survivor అంటే ఏ ఒక్కరు కానీ బతికి ఉన్న మిగిలిన వారు కానీ.. 'SUCCESSIVE' అంటే ఒకరి తరువాత ఒకరు. అంటే ముందు పేరు ఉన్న వారికి మొత్తం డబ్బులు చెల్లించబడతాయి. ముందువారు పోతేనే రెండోవారికి, రెండో వారు పోతేనే మూడో వారికి చివరగా నాలుగో వారికి డబ్బులు చెందుతాయి.
'SIMULTANEOUS' అంటే ఒకేసారి నలుగురుకీ సమానంగా
- నా లేక ఎంత ఎంత నిష్పత్తిలో డబ్బులు చెందుతాయో ముందే బ్యాంక్ కి నామినేషన్ ఇచ్చే సమయంలోనే చెప్పడం.
- అయితే బంక్ లాకర్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం నాలుగు పేర్లు ఇచ్చినా ఇన్ని అప్షన్స్ లేవు. దానిలో ఒక్క 'SUCCESSIVE' క్లాజ్ ప్రకారం మాత్రమే నామినేషన్ ఇవ్వవచ్చు. అంటే ఒకరు పోతేనే తరువాత వారికి ఆ వరుసలో చెందుతుంది.
- ఈ మధ్య కాలంలో బ్యాంకింగ్ రంగంలో ఖాతాదారులకు ఉపయోగపడే గొప్ప సంస్కారణగా దీనిని చెప్పుకోవచ్చు
....చాడా శాస్త్రి