ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో అక్రమంగా వుంటున్న బంగ్లాదేశీయులపై కఠిన చర్యలకు ఉపక్రమించారు.
దేశ రాజధానిలో అక్రమంగా చొరబడి, నివాసముంటున్న బంగ్లాదేశీయులపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు ఎల్జీ ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, నగర పోలీస్ కమిషనర్ కి కూడా లేఖ రాశారు. రాబోయే 60 రోజుల్లో అక్రమ వలసదారుల్ని గుర్తించి, వారిని బహిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఎల్జీ ఆదేశించారు.
నిజానికి, దర్గా హజ్రత్ నిజాముద్దీన్ బస్తీకి చెందిన ముస్లిం నాయకులు మరియు ఢిల్లీకి చెందిన ఉలేమాల ప్రతినిధి బృందం బంగ్లాదేశ్‌లోని హిందూ మరియు ఇతర మైనారిటీ వర్గాలపై దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారందరూ ఎల్జీ సక్సేనాకి ఓ మెమోరండం కూడా సమర్పించారు. అలాగే ఢిల్లీలో అక్రమంగా వుంటున్న బంగ్లాదేశీయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేశారు.