ఖలిస్తానీ వేర్పాటు ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ అయోధ్య రామాలయంతో సహా పలు దేవాలయాల లక్ష్యంగా బెదిరింపులకు దిగాడు.ఈనెల 16,17 తేదీల్లో అయోధ్య దేవాలయంతో సహా పలు దేవాలయాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు.
ఆ మేరకు ఓ వీడియో కూడా విడుదల చేశాడు. ఈ వీడియోలో అన్యాపదేశంగా బ్రాంప్టన్ దేవాలయ విధ్వంసం గురించి కూడా మాట్లాడాడు. హిందుత్వ భావజాలానికి పుట్టినిల్లుగా వున్న అయోధ్య పునాదులను తాము పెకిలించివేస్తామని వీడియోలో ప్రకటించాడు. భారత్ లోనే అత్యంత పవిత్రమైన అయోధ్య దేవాలయం విషయంలో పన్నూ ఇలా ప్రత్యక్షంగా ప్రకటించడాంటే ఆ దేవాలయానికి ముప్పు పొంచివుందని అర్థమైపోతుంది.
ఇదే వీడియోలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంలో ప్రధాని మోదీ అక్కడ పూజలు చేస్తున్న దానిని కూడా చూపించారు. పన్నూన్ ఇలా హెచ్చరికలు జారీ చేయడం ఇదేమీ కొత్త కాదు. గత నెల నవంబర్ 1, 19 తేదీల మధ్య ఎయిరిండియా ను కూడా హెచ్చరించాడు. భారత దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి, అస్థిరపరచడానికి అనేక ప్రకటనలు చేశాడు.జూలై 2020 లో ఉపా చట్టం కింద భారత ప్రభుత్వం పన్నూను ఉగ్రవాదిగా ప్రకటించింది. అతని అరెస్ట్ కోసం పలు వారెంట్లు కూడా జారీ చేసింది. అయినా... పన్నూ కెనడా నుంచి ఇలాంటి హెచ్చరికలు పంపుతూనే వున్నాడు.