Vote Jihad |
మహారాష్ట్రలో ‘‘ఓటు జిహాద్’’.. రంగంలోకి 400 ఎన్జీవోలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొన్ని కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని NGOల పనులు అత్యంత వివాదాస్పదమవుతున్నాయి. హిందువులకు వ్యతిరేకంగా ముస్లిం ఓటర్లను కూడగట్టడానికి ఈ NGO లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
మత ఛాందసాన్ని, మతాన్ని రెచ్చగొట్టడం ద్వారా జాతీయవాద నేతలను, జాతీయవాద భావాలున్న ఓటర్లను దెబ్బతీయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 400 లకు పైగా NGO లు ఇదే పనిలో నిమగ్నమైనట్లు కొన్ని రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. కేవలం ముస్లింలను రెచ్చగొట్టడం, వారి ఓటు బ్యాంకును కేంద్రీకృతం చేయడంపైనే పనిచేస్తున్నాయి. ఈ పనులు కాస్తా ‘‘ఓటు జిహాద్’’ అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియను తారుమారు చేయడానికి కుట్రలు పన్నుతున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.
శివాజీ నగర్, ముంబాదేవి, బైకుల్లా, మాలెగావ్ సెంట్రల్ వంటి అధికంగా ముస్లింలు వుండే ప్రాంతాల్లో గణనీయంగా ప్రయత్నాలు చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల సమయంలోనూ వీరి సంఖ్య బాగా పెరిగిపోయిందన్నట్లు కూడా తెలుస్తోంది. ఓటింగ్ శాతం కూడా అధికంగానే వుంది. ముస్లిం ఓటర్లను ఓటింగ్ కి వెళ్లేలా, ఎన్నికలను ప్రభావితం చేసేలా ప్రయత్నాలు చేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల సమయంలోనూ ఈ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం 60 శాతానికి పైగా మించిపోయింది.
గత ఎన్నికలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ముస్లిం ఓటర్లకు ఓటు పాత్ర, ప్రాముఖ్యతను వివరించడంతో పాటు పనిలో పనిగా జాతీయవాద సంస్థలకు, జాతీయవాద వ్యక్తులకు వ్యతిరేకంగా ఓటు వేయమని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇలా చేయడం ద్వారా ఓటింగ్ వాతావరణాన్ని చెడగొట్టడంతో పాటు మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తించే వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ఇందులో మరాఠీ ముస్లిం సేవా సంఘ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
ఈ పరిణామాలపై మరాఠీ ముస్లిం సేవా సంఘ్ నేత ఫకీర్ మహ్మద్ ఠాకూర్ స్పందించారు.తాము కేవలం రాజ్యాంగ విలువలను కాపాడడానికి, లౌకిక అభ్యర్థులకే ఓటు వేయమని ముస్లింలను ప్రోత్సహిస్తున్నామని, ఇందులో ఏమీ లేదని బుకాయించే ప్రకటనలు చేస్తున్నారు. బలమైన ముస్లిం ఓటర్లను నిర్మించడేమ తమ లక్ష్యమని ప్రకటించుకున్నారు. సీఏఏ, ఎన్నార్సీ వంటి వాటికి వ్యతిరేకంగా, బీజేపీని తిరస్కరించి, లౌకిక వాదానికి కట్టుబడి వుండే వారికే ఓటు వేయమని తాము చెబుతున్నామని చెప్పుకొచ్చారు.ముస్లింల హక్కులను ఇవి హరించివేస్తున్నాయని, ఆ ముప్పును ఎదుర్కోడానికి రాజకీయ భాగస్వామ్యం అత్యంత ముఖ్యమన్నారు. తాము ఇలా భావించినందు వల్లే ఈ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
అయితే ఈ ప్రయత్నాలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. ఈ ఎన్జీవోలు మహారాష్ట్రలో మత విభేదాలు రేపడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని, తమ రాజకీయ లబ్ధి కోసం ఆజ్యం పోస్తున్నారని జాతీయవాదులు, బీజేపీ ఆరోపిస్తోంది. ఈ సంస్థలు విద్వేషాన్ని పెంచుతున్నాయని, బీజేపీకి వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. దీనిపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు కూడా చేసింది.
ఈ గ్రూపులు కేవలం ఓట్ల సమీకరణలో మాత్రమే నిమగ్నమ లేవని, ముస్లిం సమాజానికి బీజేపీని శత్రువుగా చూపడానికి ప్రయత్నాలు చేస్తున్నాయంటున్నారు. వారు పంపిణీ చేస్తున్న కరపత్రాల్లో విషయం ఎలా వుందో తాము గమనించామని అంటున్నారు. మదర్సాల మూసివేత, ఉమ్మడి పౌరస్మృతి, షరియా చట్టం లాంటి విషయాలను అందులో ప్రస్తావించారని బీజేపీ గుర్తు చేస్తోంది. ఈ ప్రయత్నాలు సమాజంలో అశాంతిని సృష్టిస్తున్నాయని, ఇది కుట్రలో భాగమేనని అంటున్నారు.
టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ నివేదిక చెబుతోంది ఇదే....
ఈ ఎన్జీవోల పనితనం, జాతీయవాదులకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంపై టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ (TISS) ఓ నివేదిక వెల్లడించింది. అక్రమ వలసదారులను, ముఖ్యంగా పొరుగు దేశాల నుంచి వచ్చిన జనాభాను, రాజకీయ విషయాలను బాగా ప్రభావితం అయ్యేలా ఈ సంస్థలు చేస్తున్నాయని ఈ సంస్థ అధ్యయనంలో తేటతెల్లమైంది.TISS అధ్యయనం ప్రకారం, ఈ వలసదారులు, వీరిలో చాలా మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, ఎన్నికలను తారుమారు చేయడానికి మరియు నిర్దిష్ట ఓటు బ్యాంకులను పెంచుకోవడానికి కొన్ని రాజకీయ సమూహాలు సఉపయోగించుకుంటున్నాయని ప్రకటించింది.
ఈ వలసదారులు దాదాపుగా నైపుణ్యమైన ఉద్యోగాల్లో వున్నారని, వేతనాలను తక్కువగా ఇస్తూ... స్థానికుల్లో ప్రభుత్వంపై ఆగ్రహం తెప్పించే వాతావరణాన్ని సృష్టించారని, ఇలా ఆర్థికంగా ఉద్రిక్తతలను సృష్టించడానికి కూడా ఈ సంస్థలు కుట్రలు పన్నాయని నివేదిక పేర్కొంది.అంతేకాకుండా ఈ అక్రమవలస దారులను ఓటర్లుగా కూడా నమోదు చేయించాయని, సరైన పర్యవేక్షణ ఈ ప్రాంతాల్లో లేదని కూడా నివేదిక ఎత్తిచూపించింది.
ఈ పరిణామాలను ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీస్తుందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి చర్యలు ఎన్నికల విశేషతను దెబ్బతీస్తాయని, ప్రజాస్వామ్య వాతావరణం పూర్తిగా మారిపోయే ప్రమాద ముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరాఠీ ముస్లిం సేవా సంఘ్ తో సహా దాదాపు 400 NGO సంస్థలు ఓటు జిహాద్ లో నిమగ్నమై వున్నాయి. జాతీయవాద భావాలున్న బీజేపీని ఓడించడానికే ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నాయని అంటున్నారు.