హరిద్వార్ లో ఈరోజు గంగ ఉత్సవ్ 8వ సంచిక జరగనుంది. హరిద్వార్ లోని చండీ ఘాట్ లో జాతీయ ‘నమామి గంగే’ గంగా పరిశుభ్ర మిషన్ ఆధ్వర్యంలో గంగా ఉత్సవ్ జరుగుతుంది.
గంగా నది పరిరక్షణను పెంపొందించి ఆ నది సంస్కృతిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈరోజు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గంగ ఉత్సవాన్ని ప్రారంభిస్తారు మహిళల రివర్ రాఫ్టింగ్ ప్రచారం ద్వారా 20 మంది మహిళలు దేవప్రయాగ నుంచి 50 రోజులపాటు ప్రయాణించి గంగసాగర్ చేరుకుని గంగానది ప్రాముఖ్యత గురించి ప్రచారం చేయడం ప్రముఖ అంశం.