దేవభూమి |
ఉత్తరాఖండ్ దేవభూమి. అది దేవతల భూమి. హిందువులకు అత్యంత పవిత్రమైన భూమి. అలాంటి దేవభూమి భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోతోంది.అలాగే జనాభా స్వరూపం కూడా పూర్తిగా మారిపోతోంది. ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోయింది.
వక్ఫ్ బోర్డు ఆస్తులలో కూడా ఊహించని పెరుగుదల. రాష్ట్రంలో పెరుగుతున్న ముస్లిం జనాభా భవిష్యత్తులో రాజకీయ, సామాజిక సమస్యలను సృష్టించే ఛాన్స్ కూడా వుంది. ఇందుకు నిదర్శనం ఇప్పటి పరిణామాలే. ఇప్పుడు చూపుతున్న లెక్కలే కాకుండా.. ప్రభుత్వ భూములను కూడా వక్ఫ్ కబ్జాచేసి, కట్టిన ఆస్తులు కూడా వందల సంఖ్యలో వున్నాయి. మదర్సాలు, మసీదులు, సమాధుల వంటివీ వున్నాయి.
ఈ సనాతన క్షేత్రంలో 5 వేలకు పైగా వక్ఫ్ బోర్డుల ఆస్తుల ప్రస్తావన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని 5183 ఆస్తుల వివరాలను ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు కూడా పంపింది.ఇది కాకుండా 205 ఆస్తులకు సంబంధించిన కేసులు కూడా స్థానిక కోర్టులో పెండింగ్లో ఉన్నాయని వక్ఫ్ పేర్కొంది. ఇప్పటి వరకూ అందించిన సమాచారం ప్రకారం 2003 లో ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు ఏర్పడినప్పుడు 2078 ఆస్తులకు సంబంధించిన సమాచారం అందింది. ఈ ఆస్తులు ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డుకు యూపీ వక్ఫ్ నుంచి సంక్రమించాయి. వీటిలో 450 ఫైళ్లు యూపీ నుంచి ఉత్తరాఖండ్ కి చేరనే లేదు.
దేవ భూమిలో వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎక్కడ వున్నాయంటే...
వక్ఫ్ బోర్డు ఆస్తుల జాబితాలో మసీదుల కంటే శ్మశాన వాటికలే అధికం. కొండ ప్రాంతాలైన జిల్లాల్లో చమోలీలో ఒకటి, రుద్రప్రయాగలో ఒకటి, టెహ్రీలో నాలుగు, పౌరీలో పది, ఉత్తరకాశీలో ఒకటి, బాగేశ్వర్ లో మూడు, చంపావత్ లో ఆరు, అల్మోరాలో ఆరు, పిథోరాఘర్ లో మూడు మసీదులు వున్నాయి. మరిన్ని సమాధులు కూడా వున్నాయి. నైనిటాల్ లో 48 మసీదులు, ఉదమ్ సింగ్ నగర్ లో 144, హరిద్వార్ జిల్లాలో 322, డెహ్రూడూన్ జిల్లాలో 155 మసీదులున్నట్లు వక్ఫ్ బోర్డులో నమోదయ్యాయి.
వీటితో పాటు దానమిచ్చిన ఆస్తుల లెక్కలు కూడా బయటకు వచ్చాయి. 2015 లెక్కల ప్రకారం ఔకాఫ్ (దానమిచ్చిన) ఆస్తులు అల్మోరా జిల్లాలో 46, పితోర్ గఢ్ జిల్లాలో 11, పౌరీలో 26, హరిద్వార్ లో 865, డెహ్రాడూన్ లో 499 తో పాటు మరో 435 ఆస్తులను తమవేనని వక్ఫ్ చెప్పుకుంది. మొత్తం ఉత్తరాఖండ్ లో 773 చోట్ల శ్మశాన వాటికలు నిర్మించారు. ఇక.. 704 మసీదులను వక్ఫ్ బోర్డు కింద ప్రకటించారు. ఉత్తరాఖండ్ లోని వక్ఫ్ బోర్డు జాబితాలో మాత్రం మరిన్ని వున్నాయని అంటోంది.
వక్ఫ్ బోర్డు పరిధిలో 100 మదర్సాలు వుండే అవకాశముందని అధికారులు అంటుంటగా... వక్ఫ్ మాత్రం 400 కి పైగా మదర్సాలు నమోదైనట్లు అంటోంది. అలాగే వక్ఫ్ బోర్డులో 201 కి పైగా సమాధులు వున్నట్లు సమాచారం. నమాజ్ కూడా ఇక్కడే చేస్తున్నట్లు సమాచారం. ఇవి కాస్తా మదర్సా మసీదులుగా మెళ్లిగా రూపాంతరం చెందుతున్నాయి. రాష్ట్రంలో 12 పాఠశాలలున్నాయి. అదే జాబితాలో 1024 ఇళ్లు, 1711 దుకాణాలున్నాయి. 70 ఈద్ గాహలు, 32 ఇమాంబరాలు, 112 వ్యవసాయ భూమి ప్లాట్లు మరియు 253 ఇతర ఆస్తులూ వున్నాయి.
అలాగే వక్ఫ్ కి చెందిన ఆస్తులు ల్యాండ్ మాఫియా ఆధీనంలో కూడా వున్నాయన్నది మరో వాదన. ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు 2003 లో స్థాపించినప్పుడు వక్ఫ్ ఆధీనంలో 2078 వరకు ఆస్తులున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇందులోని 450 ఫైళ్లను ఉత్తరాఖండ్ వక్ఫ్ జాతీయ వక్ఫ్ బోర్డుకి సమర్పించనే లేదు. ఈ విషయం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి చేరింది.
దేవభూమి ఉత్తరాఖండ్ లో వక్ఫ్ బోర్డు ఆస్తుల సంఖ్య గత 20 ఏళ్లలో రెండింతలు పెరిగిందని భావిస్తున్నారు. ముస్లిం జనాభాయే ఇందుకు తార్కాణమని కూడా అంటున్నారు.వాస్తవానికి వక్ఫ్ బోర్డులో నమోదు కాని ముస్లిం మత స్థలాలు, మదర్సాలు ఇప్పటికీ భారీ సంఖ్యలోనే వున్నాయి. ఏదేమైనా, దేవభూమి ఉత్తరాఖండ్లో వక్ఫ్ ఆస్తులు వేగంగా పెరగడం కూడా ఆందోళన కలిగించే విషయం, రాష్ట్రంలో జనాభా మార్పుపై చర్చ జరుగుతోంది. పెరుగుతున్న వక్ఫ్ ఆస్తుల గణాంకాలు దేవభూమి ఉత్తరాఖండ్ యొక్క సాంస్కృతిక రూపాన్ని ఇస్లామీకరించడానికి కుట్ర జరుగుతోందని సూచిస్తున్నాయి.