ఈ నెల 22 నుంచి 24 వరకూ గోరఖ్ పూర్ లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా జీహో కార్పొరేషన్ సీఈవో శ్రీధర్ వెంబు హాజరుకానున్నారు.
దేశ వ్యాప్తంగా ఈ సదస్సుకు హాజరయ్యే ఏబీవీపీ సదస్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఈ మేరకు ఏబీవీపీ ఓ ప్రకటనను విడుదల చేసింది. టెక్ పరిశ్రమతో పాటు యాంట్రాప్రెన్యుయర్ ను ప్రోత్సహించడంలో శ్రీధర్ వెంబుకి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వుంది. భారతదేశ సాంకేతిక అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి మరియు విద్యావ్యవస్థలో గణనీయమైన సంస్కరణలను తీసుకురావడంలో ఆయన చేసిన కృషి నేటి భారత యువతకు ప్రోత్సాహ జనకంగా వుంటుంది.
Sridhar Vembu |
శ్రీధర్ వెంబు తమిళనాడులోని టెన్ కాశీ జిల్లాలో జోహో కార్పొరేషన్‌ను స్థాపించారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలను సృష్టించారు. తమిళనాడులోని మారుమూల ప్రాంతంలో పరిశ్రమను స్థాపించడం ద్వారా, కార్పొరేట్ స్థాయిలోనే లభించే ఉద్యోగాలను కూడా ఆయన ఇవ్వగలిగారు. దీంతో యువతకు రోల్ మోడల్ గా నిలిచారు. గ్రామీణ జీవితానికి సాంకేతికతను జోడించం, అనుసంధానించడం వెనుక ఆయన కృషి ఎంతో వుంది.