యూపీలోని మీరట్ ప్రాంతంలో 150 మంది తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారు. ఇంతకు పూర్వం వీరు క్రైస్తవ మిషనరీలు చెప్పిన తప్పుడు మాటలకు విని, మోసపోయి, క్రైస్తవాన్ని స్వీకరించారు. కానీ… ఇప్పుడు వారు చెప్పిన మాటలన్నీ తప్పు మాటలని తెలుసుకొని, హిందూ ధర్మ ప్రాశస్త్యాన్ని తెలుసుకొని, తిరిగి హైందవంలోకి వచ్చేశారు.
ఈ 150 మంది వ్యక్తులను పాస్టర్ బిజ్జు మాధ్యూ ప్రలోభపెట్టి, క్రైస్తవంలోకి తీసుకున్నాడు. మరోవైపు గోలాబాద్ గ్రామంలోని 30 కుటుంబాలు నిత్యం చర్చికి వెళ్లేవారు. క్రైస్తవులు చెప్పినట్లు నడుచుకునేవారు. ఇలా పాస్టర్ మాథ్యూ 300 కుటుంబాలను మతం మార్చేశాడు. ఈ విషయాన్ని ఆయన పోలీసుల ముందే స్వయంగా అంగీకరించాడు. డబ్బులివ్వడం, వివాహాలు చేయడం, ఆరోగ్య సమస్యలు తలెత్తితే వైద్య సదుపాయాలు కల్పించడం లాంటి ప్రలోభాలు గురిచేసేవాడు. ఈ విషయాన్ని ఆయనే పోలీలసు విచారణలో అంగీకరించాడు.
కొద్ది మంది బృందాలతో పాస్టర్ మ్యాథ్యూ పక్క గ్రామాల్లో తిరిగేవాడు. ముఖ్యంగా పేద హిందూ కుటుంబాలను టార్గెట్ చేసేవాడు. చర్చిలో జరిగే ప్రార్థనలకు హాజరైతే అన్ని సమస్యలు పోతాయంటూ ప్రలోభపెట్టేవాడు. డబ్బులు కూడా పంచేవాడు. అలాగే వివాహాలకు అయ్యే ఖర్చులను కూడా చర్చి పక్షాన ఇచ్చేవాడు. వీటన్నింటితో పాటు హిందూ మతంపై ద్వేషాన్ని పెంచుతూ… బ్రెయిన్ వాష్ చేసేవాడు. దీంతో ఆయన వలలో హిందువులు పడ్డారు. ఇవన్నీ విషయాలు విచారణలో తేలడంతో పాస్టర్ మ్యాథ్యూను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతి ఆదివారం కూడా తన ఇంట్లో గట్టి గట్టిగా ప్రార్థనలు చేస్తూ అందర్నీ ఆకర్షించేవాడు. దీంతో స్థానికులకు అనుమానాలు వచ్చాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.