Sangh Parivar |
1925 సం. లో దశమి నాడు కొద్ది మంది స్వయంసేవకులతో ప్రారంభం నేటికి కోట్ల మంది దేశ సేవకులను తయారు చేసుకుని మాతృభూమి సేవలో 99 సం. లు పూర్తి చేసుకుని 100 వ సం.లో అడుగుపెడుతున్న "రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్" అదే RSS కు శుభాకాంక్షలు.
ఏదైనా టాపిక్ మాట్లాడండి వెంటనే మన సెక్యూలర్ మేధావులు 'సంఘ్ పరివార్' ని అంటే రాష్ట్రీయ సేవక్ సంఘ్ కుటుంబాన్ని విమర్శిస్తారు. అసలు ఈ పరివారం అంటే ఏమిటీ? ఇదీ దేశంలో మిగతా పరివారాలు వంటిదేనా ? ఈ పరివారంలో కుటుంబ సభ్యులు ఎవరు? ఇన్ని కోట్ల మందిని ఇన్ని దశాబ్దాలుగా కలిపి ఉంచుతున్న బంధం ఏమిటి? చూద్దాం...
అబ్బో ...
ఈ 'సంఘ' కుటుంబంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారు చాలా మంది సేవకులు అంటే వున్నారు. క్లుప్తంగా కొన్నే చెప్ప దలచుకుంటే...
మొదటిగా...
"రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్"(మాతృ సంస్థ) దీనినే ఇంగ్లీషు లో సాధారణంగా గా RSS అని పిలుస్తారు.
ఈ ఆర్.యస్.యస్., మరియు దీని అనుభంధ సంస్థలన్నింటినీ కలిపి సంఘ్ పరివార్ అని పిలుస్తారు. ఈ RSS ఛత్రం క్రింద:
- భారతీయ మజ్దూర్ సంఘ్,
- భారతీయ కిసాన్ సంఘ్,
- అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్,
- సేవా భారతి,
- వనవాసి కళ్యాణ ఆశ్రమం,
- స్వదేశీ జాగరణ మంచ్,
- ప్రజ్ఞా ప్రవాహ్,
- ఇతిహాస సంకలన సమితి,
- విద్యా భారతి,
- సంస్కార భారతి,
- సంస్కృత భారతి,
- అధివక్తా పరిషత్,
- పూర్వ సైనిక పరిషత్,
- విశ్వ హిందూ పరిషత్,
- సమాచార భారతి,
వీటిలో ముఖ్యమైనవి. భారతీయ జనతా పార్టీ నేరుగా కాకపోయినా కొన్ని ఆ సిద్ధాంతాల ఆధారంగా పనిచేస్తుంది. ఆర్.యస్.యస్. తోపాటు ఈ సంస్థలన్నింటికి చాలా పెద్ద సంఖ్యలో సభ్యులున్నారు.
సరే ఒక కుటుంబం ఉంది అంటే ఆ కుటుంబ సభ్యుల మధ్య ఉండే బంధుత్వాలు లేదా బంధాలు వల్ల వారందరూ ఒక కుటుంబంగా పిలువబడతారు.
సరే! మరి ఇన్ని కోట్ల RSS సభ్యులను కలిపి ఉంచుతున్న అంత బలమైన బంధుత్వం కానీ బంధం కానీ ఏమిటి?
అదే ఆ బలమైన బంధమే " దేశభక్తి "
అవును. దేశభక్తి అనే బలమైన బంధమే వీరందరినీ కలిపి ఉంచుతోంది. వీరు ఎంత కష్టమైన పని అయినా ఏ వాతావరణంలో అయినా ధైర్యంగా నిలబడి పూర్తి చేయగలుగుతున్నారు అంటే ఈ 'దేశభక్తి' అనే శక్తే వారికి బలం. నా దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలబడాలి. నా దేశ సంస్కృతిని, పురాణ పురుషులను, మహనీయులను ప్రపంచం అంతా గుర్తించాలి. ఎప్పటికి అయినా నా భారత్ "విశ్వ గురువు" కావాలి అనే బలమైన కాంక్ష వీరందరినీ ఎంత కష్ట సాధ్యమైన పనికి అయినా పురికొల్పుతుంది.
మరి ఈ సంఘ పరివార్ అంటే కొందరు మేధావులకు ఎందుకు కోపం?
ఎందుకంటే భారత్ అధికారం ఈ పరివార్ వాళ్ళ చేతుల్లోకి వెళితే, ఇన్నాళ్లూ ఇతర 'పరివార్' ల అంటే కుటుంబాల భజన చేస్తూ, వాళ్లని వెనకేసుకు వస్తూ, వారి పంచన బతుకుతున్న ఆ "పరివార్'- అంటే కుటుంబ కుల పార్టీల అస్తిత్వానికి ముప్పు వస్తుంది అని భయం.
స్వాతంత్రం వచ్చాక ఈ దేశ మేధావులు సెక్యూలరిజం పేరుతో కుల కుటుంబ పార్టీలను కాక వేటిని ప్రోత్సహించారు? ఆర్ ఎస్ ఎస్ మీద ద్వేషంతో ఇప్పటికీ ఈ మేధావులు భుజాన్న మోసే పరివారాలు చూడండి. నిజంగా నిజాయితీగా చెప్పండి ఈ పార్టీలకు ముందు ప్రాధాన్యత దేనికి ఉంటుంది? వారి కుటుంబ అభివృద్ధా? లేక దేశ అభివృద్ధా ?
- నెహ్రు పరివారం
- పవార్ పరివారం
- థాక్రే పరివారం
- కరుణానిధి పరివారం
- దేవెగౌడ పరివారం
- కేసీఆర్ పరివారం
- బాబు పరివారం
- వైస్సార్ పరివారం
- పట్నాయక్ పరివారం
- ములాయం పరివారం
- మాయావతి పరివారం
- లాలూ పరివారం
- మమతా పరివారం
- అబ్దుల్లా పరివారం
- ముఫ్తి పరివారం
- సోరేన్ పరివారం
ఏ రంగంలో అయినా కుటుంబ సభ్యులను ప్రోత్సహించడం అనేది ఉంటుంది. అందుకే అన్ని రాజకీయ నాయకులు తమ కుటుంబ సభ్యులను రాజకీయాలలోకి రావడానికి ప్రోత్సహిస్తారు. అది తప్పు కాదు. ప్రజాస్వామ్య బద్దంగా పార్టీలు నడిస్తే అక్కడ టాలెంట్ ఉంటే ఎదుగుతారు లేదా మరుగున పడిపోతారు. కానీ మనం పైన చెప్పుకున్న పరివారాలు అన్ని ఆ రాజకీయ పార్టీలను ఒక కుటుంబ ఆస్తిగా భావించి ఆ కుటుంబ సభ్యులు మాత్రమే పార్టీ అధ్యక్షులు లేదా ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి అవుతారు.
ఈ పరివారాలు అన్నిటికి అధికారం తమ కుటుంబ సభ్యుల చేతిలోనే తరతరాలుగా ఉండాలి అని ప్రగాఢమైన కోరిక. దానికోసం అంటే తమ కుటుంబ సభ్యుల ఎదుగుదల కోసం వారి పార్టీలలోనే మంచి అర్హత కలిగి దేశానికి వారి సేవలు ఉపయోగపడతాయి అనుకుంటున్నవారిని కూడా తమ కుటుంబ సభ్యుల ఎదుగుదలకు అడ్డు రాకుండా తొక్కేస్తారు, ఎదగనివ్వరు.
ప్రజాస్వామ్యం పేరుతో కుల కుటుంబ పార్టీలకు వారి కుటుంబ హితం ముఖ్యం, ఆ కుటుంబాలను నమ్ముకున్న వంది మాగధుల ప్రయోజనాలు ముఖ్యంగా ఉంటుంది కానీ రాష్ట్ర/ జాతీయ హితం ఎందుకు ఉంటుంది?
సంఘ పరివార్ నుండి వచ్చిన బీజేపీలో ఎవడు తరువాత అధ్యక్షుడు అవుతాడో తెలీదు, ఎవరు ప్రధాని ఆవుతారో తెలియదు, ఏ రాష్ట్రంలో ఎవరు రాష్ట్ర అధ్యక్షుడు గా లేక ముఖ్యమంత్రి గా వస్తారో తెలియదు. అది సంఘ సంస్కారం నుండి వచ్చిన బిజెపికి మిగతా కుటుంబ పార్టీలకు తేడా!
బిజెపిలో నిజమైన ప్రజాస్వామ్యం ఉంది. ఇక్కడ క్రింద నుండి వచ్చిన సాధారణ కార్యకర్తలు కూడా పై దాకా మెట్లు ఎక్కడానికి ఛాన్స్ ఉంది. కానీ పైన చెప్పుకున్న కుటుంబ పార్టీలలో సాధారణ కార్యకర్తలకు టాప్ పొజిషన్స్ అనేవి కలలో కూడా ఊహించలేము.
అందుకే బిజెపి ఏ నిర్ణయం తీసుకున్నా ఏ ఒక్క కుటుంబ బాగుకోసమో తీసుకోదు. ఎక్కడ అయినా తమ కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికో ప్రధానిని చేయడానికో కాంప్రమైజ్ అవ్వదు.
- సోనమ్మ రాజ్యం
- పవరయ్య రాజ్యం
- థాకరయ్య రాజ్యం
- యాదవయ్య రాజ్యం
- మాయమ్మ రాజ్యం
- లాలయ్య రాజ్యం
- మమతమ్మ రాజ్యం
- చంద్రన్న రాజ్యం
- జగనన్న రాజ్యం
- చంద్రయ్య రాజ్యం
- దేవయ్య రాజ్యం
- కరుణయ్య రాజ్యం.
గతంలో చిన్న రాజ్యాలు, సంస్థనాలు కొన్ని కుటుంబాల చేతుల్లో ఉండేవి. ఇప్పుడు రాష్ట్రాలు కొన్ని కుటుంబాల చేతుల్లో ఉన్నాయి. అంతే తేడా.. దీనికే మనం ప్రజాస్వామ్యం అనే పేరు పెట్టి పిలుచుకుంటున్నాం.
కానీ, తమ సిద్దాంత అవసరాల దృష్ట్యా RSS మీద పట్టలేనంత ద్వేషంతో వామపక్షాలు, వారి కుటుంబాల రాజకీయ మనుగడ కోసమే రాజకీయాలు చేస్తున్న కుటుంబ పార్టీలను, దేశం ఏం అయిపోయినా ఫరవాలేదు అనే రీతిలో RSS ని ద్వేషించే మేధావులు వత్తాసు పలుకుతూ ఈ అవినీతి కుటుంబాల పాలనలనే నిర్లజ్జగా సమర్ధిస్తున్నారు.
అందుకే RSS కి మీరూ మద్దత్తు తెలుపండి. మేధావులు RSS గురించి చెప్పే చెడు మాటలు వినకుండా, దగ్గరలో ఉన్న సంఘ శాఖకు వెళ్లి అక్కడ ఏం నేర్పుతున్నారో స్వయంగా మీరే తెలుసుకోని నిజ నిర్ధారణ చేసుకోండి.
నమస్తే..సదా వత్సలే... మాతృభూమే...
చాడా శాస్త్రి..