PM Modi |
భారతమాత విషయంలో సంఘ్ సంకల్పం అనిర్వచనీయం : ప్రధాని మోదీ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి సేవ చేయడంలో ఆ సంస్థ అచంచలమైన నిబద్ధతతో పనిచేస్తోందని ప్రశంసించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. శతాబ్దిలోకి అడుగపెట్టిన సందర్భంగా భారత మాత పట్ల , దేశం పట్ల సంఘ్ సంకల్పం అనిర్వచనీయమని అన్నారు. అలాగే భారతమాత విషయంలో ఆ సంస్థ అంకిత భావాన్ని కూడా కొనియాడారు. సంస్థ అంకిత భావం, సంకల్పం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినందిస్తుందన్నారు.
అలాగే అభివృద్ధి చెందిన భారత్ ను నిర్మించే లక్ష్యాన్ని కూడా శక్తిమంతం చేస్తుందని విశ్వసించారు. ఇక... శతాబ్దిలోకి అడుగపెట్టిన సందర్భంగా స్వయంసేవకులందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. వంద సంవత్సరాల ప్రయాణం దేశంపట్ల దాని అంకిత భావానికి నిదర్శనమని అభివర్ణించారు. మరోవైపు విజయదశమి ఉత్సవం సందర్భంగా సరసంఘచాలక్ మోహన్ భాగవత్ చేసిన ఉపన్యాసాన్ని కూడా మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.