Shiva Lingam |
తమిళనాడులో బయటపడ్డ అత్యంత పురాతన శివలింగం
తమిళనాడులోని చోళధరం గ్రామంలో వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైన శివలింగం బయటపడింది.ఈ అన్వేషణ అక్కడి గ్రామస్థులకు విశేషమైన ఉత్సాహాన్ని రేకెత్దతించింది. తమ సాంస్కృతిక వారసత్వం బయటపడిందన్నారు. తంజావూరు నుంచి అంకిత భావంతో వున్న ఓ యువకుల బృందం వచ్చి, తమిళనాడు అంతటా పురాతన శివ లింగాలను పునరుద్ధరించడం, భద్రపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వారి ప్రయత్నాలను స్థానికులను బాగా ప్రశంసించారు. తమిళనాడు సంస్కృతిని, హిందూ సంస్కృతిని సంరక్షించడంలో ఈ బృందం ముఖ్యమైన సహకారం అందించిందని మెచ్చుకున్నారు.
ఈ లింగం మట్టిలో కూరుకుపోయిందని, చెట్ల మధ్య గూడుకట్టుకున్నట్లే వుందని వారు తెలిపారు. లింగం అవశేషాలు బయటపడుతున్న కొద్దీ... తవ్వకం కూడా అత్యంత జాగ్రత్తగా చేశామని ఆ బృందం పేర్కొంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడం వెనుక చాలా మంది పనిచేశారు. స్థానికంగా వుండే వాలెంటీర్లు, ఔత్సాహికులు ఉపయోగపడ్డారు. చారిత్రక కట్టడాలను సంరక్షించడంలో సమిష్టిగా కృషి చేశామని చెప్పుకొచ్చారు. ఈ శివలింగం బయటపడటంతో భక్తులు భారీగా వస్తున్నారు. పవిత్ర స్థలాల పునరుద్ధరణలో ఇదో కీలక మైలురాయి అని అంటున్నారు.