illegal Rohingya |
అక్రమ నివాసాలతో పాటు ఇదీ రోహింగ్యాల విచ్చలవిడితనం
హర్యానాలోని మేవాత్ ప్రాంతంలో రోహింగ్యా ముస్లింలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ఆ ప్రాంతాన్ని తమకు అడ్డాగా మార్చుకొని, అనేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా మొవాత్ ప్రాంతంలోని నుహాన్లో బయటి నుంచి అక్రమంగా వచ్చిన రోహింగ్యాలు చాలా సంఖ్యలో వున్నారు. అక్రమంగా తాత్కాలిక నివాసాల్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఓ వైపు... మరోవైపు అక్రమంగా నివాసముంటూనే... అక్రమంగా మదర్సాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇది తాజాగా వెలుగులోకి వచ్చింది.వీరంతా 2016 లో భారత్కి వచ్చి, ఇప్పటికీ అక్కడే వుంటున్నారు. మదర్సాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ ప్రాంతం నుంచే విజయం సాధించింది కూడా.
ముస్లిం ప్రాబల్యం వున్న ఇక్కడ ఏకపక్షంగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి మామన్ ఇక్కడి హిందువులను బెదిరించాడు కూడా. ముస్లింల జోలికి వస్తే ఈ ప్రాంతం విడిచి వెళ్లిపోవాలని కూడా బెదిరింపులకు దిగాడంటే పరిస్థితి ఎలా వుందో ఊహించుకోవచ్చు. ఈ ప్రాంతంలో అక్రమంగా 400 మంది రోహింగ్యా ముస్లింలు నివాసముంటున్నారని సాక్షాత్తూ మదర్సాలో బోధించే వ్యక్తి యూసుస్ ఖాన్ వెల్లడించాడు. ఈ మదర్సా నంగ్లీ గ్రామంలో విశాలమైన ప్రాంతంలో నిర్మించారు. వాము గడ్డితో తాత్కాలిక నిర్మాణం వున్నట్లుగానే ఈ మదర్సా కనిపిస్తుంది. దానిపై మదర్సా ఇస్లామియా దారుల్ ఉలమ్ ఇలియాసియా అని రాసి వుంది.
మదర్సాలోని పిల్లలకు చదువు చెప్పేందుకు నహూన్ అనే ప్రాంతం నుంచి రెహ్మాన్ వచ్చి వెళ్తుంటాడు. అయితే.. ఈయన బర్మా నివాసి. 2016 నుంచి ఈ మదర్సా నడుస్తోందని స్వయంగా ఆయనే చెప్పాడు. ఇక్కడ చదివే పిల్లలంతా మయన్మార్ దేశస్థులేనని, వారికి ఇక్కడే ఆహారం పెడతామని, రాత్రి పూట బస ఏర్పాట్లు కూడా వున్నాయని తెలిపాడు. అయితే.. తామంతా ఎవరమని? ఎక్కడి నుంచి వచ్చామని మాత్రం ఇన్ని సంవత్సరాలుగా ఎవ్వరూ అడగలేదని బహిరంగంగానే చెప్పాడు. తమకు పాస్పోర్టు గానీ, వీసా కానీ లేదని చెప్పాడు. బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా అక్రమంగా భారత్లోకి ప్రవేశించినట్లు ప్రకటించారు. ఈ సరిహద్దును దాటడానికి కొంతమందిని తాము కలిశామని, వారు దాటించారని తెలిపాడు.
పిల్లలను ఓ జర్నలిస్టు ఇంటర్వ్యూ కూడా చేశాడు. మదర్సాలో ఏం చదువుకొని ఏం చేస్తారని అడగ్గా... 99 శాతం మంది పిల్లులు హఫీజ్లుగా మారి, అల్లాకు సేవ చేస్తామనే చెప్పాడు. పైగా తమకు జకీర్ నాయక్ అంటే మహా ప్రీతి అని, ప్రజలను ఇస్లాం ప్రకారం నడిపిస్తున్నాడని చెప్పడం చూస్తుంటే విస్తుపోవడం అవుతోంది.