ఏపీలో అభయాంజనేయ స్వామి ఆలయం ధ్వంసం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ములకలచెరువు ప్రాంత పరిధిలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పునాదులతో సహా ఆలయాన్ని పెకిలించి పడేశారు. గేట్లు ధ్వంసం చేసి ఆలయాన్ని ఓ వైపు నెట్టేశారు.విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడి ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి దాడికి పాల్పడిన వ్యక్తులను వెంటనే గుర్తించి శిక్షపడేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు మండలం కదిరినాథుని కోట పంచాయతీ మొలకల చెరువు సమీపంలో 16 వ శతాబ్దంలో కనుగొండ రాయస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి ఎదురుగా బండపై అభయాంజనేయ స్వామి ఆలయం కట్టారు.