288 Families Ghar Wapsi in Nepal |
నేపాల్‌ను గత కొంతకాలంగా టార్గెట్ చేసుకొని ఒకవైపు చైనా కమ్యూనిస్టుల ప్రభుత్వం, మరోవైపు క్రైస్తవులు, ఇంకొక వైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్ రోహింగ్యా చొరబాటుదారులు చిన్న దేశమైన నేపాల్‌లోకి వేలాదిగా వచ్చి స్థానిక హిందువులను ప్రలోభాలతో ఆకర్షించి లేదా బెదిరించి వారిని మతం మార్చి తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన నేపాలీ హిందువులు ఆలస్యంగా అయినా మేల్కొంటున్నారు. ఇలా మతం మార్చడానికి వచ్చే మాయగాళ్లకు గట్టి సమాధానమే చెప్పారు.
నేపాల్‌లోని సున్సారి జిల్లాలో 288 కుటుంబాలకు చెందిన 1421 మంది క్రైస్తవులుగా మారిన ఒకప్పటి హిందువులు. వీరిలో ముసహర్,సదా, మెత్తా, మండల్, ఓరాన్, రామ్ (చెప్పులు కుట్టేవారు), థారూ, నాయి(క్షురకులు), పాశ్వాన్, సర్దార్, దాస్, తత్మా) కులాలవారున్నారు. గతంలో హిందువులు అయిన వీరిని విదేశీ చర్చ్ మాయమాటలు, తప్పుడు హామీలతో ప్రలోభాలకు గురిచేసి క్రైస్తవులుగా మార్చింది.
నేపాల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా, మతం మార్చబడిన వారందరినీ ఆగస్టు 31వ తేదీ రోజున విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వేదపండితులు, సాధుసంతుల సమక్షంలో యజ్ఞం నిర్వహించి పూలవర్షం కురిపించి తిరిగి వారి స్వధర్మంలోకి స్వాగతం పలుకడం జరిగింది.
ఈ సందర్భంగా నేపాల్ దేశపు విశ్వహిందూ పరిషత్ సెక్రటరీ జితేందర్ మాట్లాడుతూ సృష్టిలోని సర్వప్రాణులు, ఝడచేతనాల శ్రేయస్సును కోరే వారెవరూ లేరని అన్య మతాల సిద్ధాంతాలను ప్రచారం చేసేవారందరూ ప్రకృతిని దోచుకోవడమే లక్ష్యంగా తమ అనుయాయులకు చెబుతుంటారని తెలిపారు. ప్రపంచంలోని ప్రతి వారి శ్రేయస్సును కోరేవారు, పంచభూతాలను గౌరవించి దేవతలుగా ఆరాధించే ప్రకృతి ఆరాధకులు కేవలం హిందువులేనని, వారి సంఖ్య తగ్గిపోతే ప్రపంచ శ్రేయస్సు కోరే వారే కరువయి ప్రపంచం అంతా కల్లోలమే అవుతుందని ప్రకటించారు. హిందువుల సంఖ్య తగ్గడానికి వీల్లేదంటూ సంఖ్య పెంచడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు.
హిందూ దేశమైన నేపాల్ ను క్రైస్తవ దేశంగా మార్చడం కోసం కేరళ నుండి మతంమార్పిడి మాయగాళ్లు వస్తున్నారని వారందరినీ జైలుకు పంపిస్తామని జితేందర్ హెచ్చరించారు.