RSS Pracharak Mallapuram Bhishmacharya passed away |
ఆరెస్సెస్ ప్రచారక్ మల్లాపురం భీష్మాచార్యులు కన్నుమూత
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జ్యేష్ఠ ప్రచారక్ మల్లాపురం భీష్మాచార్యులు కన్నుమూశారు. గురువారం నాగపూర్ లో జరిగిన ఓ సమావేశంలో పాల్గొని, తిరిగి వస్తుండగా గుండెపోటుతో బాధపడ్డారు. దీంతో వెంటనే ఆయన్ను వార్ధా, సేవాగ్రాం ఆస్పత్రిలో చేర్పించారు.
ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆయన తుదిశ్వాస విడిచారు.శుక్రవారం రోజున ఆయన పార్థివ దేహాన్ని స్వస్థలమైన భాగ్యనగర్ కి తీసుకురానున్నారు. ఆయన కోరిక మేరకు శనివారం ఆయన పార్థివ దేహాన్ని ఆస్పత్రికి దానం చేయనున్నారు.. భీష్మాచార్యులు భాగ్యనగర్ కి చెందిన స్వయంసేవకులు. ప్రచారకులుగా తమిళనాడు, శ్రీలంక, సింగపూర్ వంటి దేశాల్లో పనిచేశారు. అలాగే ఆస్ట్రేలియాలో కూడా పనిచేశారు. ప్రచారక్ గా వుంటూ అనేక మంది కార్యకర్తలకు ఆదర్శంగా నిలిచారు.