Rohingyas Muslims should not enter villages: warning signs of villagers |
రోహింగ్యాలు, ముస్లింలు గ్రామాల్లోకి రావొద్దు : గ్రామస్థుల పోస్టర్లు
ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ లోని పలు గ్రామాల హిందువులు అత్యంత కీలక నిర్ణయం తీుకున్నారు. తమ గ్రామాల్లోకి రోహింగ్యా ముస్లింలు, హైందవేతరులు రాకూడదని ఫ్లెక్సీలు పెట్టారు.
గత వారం చమోలి అనే ప్రాంతంలో లైంగిక వేధింపుల కేసు తర్వాత గ్రామంలోని హిందువులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ముస్లిం వ్యాపారులెవ్వరూ తమ గ్రామాల్లోకి ప్రవేశించడానికి వీల్లేదని హెచ్చరిస్తూ పోస్టర్లు కూడా వెలిశాయి. ఈ నియమాలను ఎవరైనా గ్రామస్థులు ఉల్లంఘిస్తే శిక్షార్హులంటూ పేర్కొన్నారు. మరోవైపు వీటికి సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. మరోవైపు పోలీసులు కూడా ఈ పోస్టర్లను ధ్రువీకరించారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి తాము గ్రామస్థులతో మాట్లాడుతున్నామని పోలీసులు పేర్కొంటున్నారు.
స్థానికుల కథనం ప్రకారం చమోలి జిల్లాలోని నంద ప్రయాగ్ ప్రాంతంలోని ఓ ముస్లిం సెలూన్ యజమాని హిందూ బాలికను లైంగికంగా వేధించినట్లు పేర్కొంటున్నారు. దీంతో ఆ ముస్లిం వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు నిరసనలకు దిగారు.
....vskts