Acharya Satyendra Das |
దోషులను శిక్షించండి : తిరుమల లడ్డూ వ్యవహారంపై ఆచార్య సత్యేంద్ర దాస్
తిరుమల ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారన్న వార్తలపై అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ తీవ్రంగా స్పందించారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లడ్డూలో జంతువుల కొవ్వును కలిపారని వార్తలు వచ్చాయని, ఆ తర్వాత అది నిజమని తేలిందన్నారు. ఇలా చేస్తూ... సనాతన ధర్మంపై కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, లోతైన దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణలో ఎవరైతే దోషులుగా తేలారో, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలన్నారు. తిరుపతి బాలాజీ అంటే ప్రపంచం మొత్తం అపారమైన నమ్మకం వుంటుందని, ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వచ్చి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తారన్నారు. అలాంటి భక్తుల మనోభావాలు దీంతో దెబ్బతిన్నాయన్నారు. అంతర్జాతీయంగా ఏమైనా కుట్రలు జరిగాయా? అన్న కోణంలోనూ విచారణ జరపాలని ఆచార్య సత్యేంద్ర నాథ్ డిమాండ్ చేశారు.