హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోని సంజౌలి ప్రాంతంలో చేపట్టిన మసీదు నిర్మాణ అక్రమమంటూ హిందూ సంఘాలు గురువారం భారీ ర్యాలీ చేపట్టాయి. విధాన సభకు సమీపంలోని చౌరా మైదాన్‌లో చేపట్టిన ర్యాలీలో వం దలాదిగా నిరసనకారులు పాల్గొన్నారు. శ్రీరాముని చిత్రంలో కూడిన కాషాయ పతాకాలు, బ్యానర్లను ప్రదర్శించారు. 15 రోజుల్లోగా మసీదు అక్రమ నిర్మా ణాన్ని కూల్చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హిందూ జాగరణ్ మంచ్, దేవ భూమి క్షత్రియ సంఘటన్ పిలుపు మేరకు నిరసన చేపట్టారు. రాష్టేతరులు రాష్ట్రంలోకి ప్రవేశించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వీటిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని హిందూ జాగరణ్ మంచ్ హిమాచల్ విభాగం అధ్యక్షుడు కమల్ గౌతమ్ డిమాండ్ చేశారు. మంత్రులు విక్రమాదిత్య సింగ్, అని రుధ్ సింగ్ గురువారం సాయంత్రం సంజౌలి ప్రాంతాన్ని సందర్శించి, అక్కడి పరిస్థితులను స్వయంగా ఆరా తీశారు. ‘సంజౌలి అంశం మతానికి సంబంధిం చినది కాదు, న్యాయం, అన్యాయాలకు సంబంధించింది. అక్రమ నిర్మాణంపై తప్పక చర్యలు తీసుకోవాలి’ అని ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్ కోరారు.