రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ |
దుష్టశక్తులు భారత్ వస్తే అంత్యక్రియలు చేస్తాం...
ప్రపంచ వ్యాప్తంగా దుష్టశక్తులు పెరిగిపోతున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. కానీ... ఆ శక్తులు భారత్ లోకి వస్తే మాత్రం క్షీణిస్తాయని, ఇక్కడ వాటికి తాము అంత్యక్రియలే నిర్వహిస్తామని తేల్చి చెప్పారు.
సద్గురు గ్రూప్ ఏర్పాటు చేసిన వేదసేవక్ సమ్మేళన్ సోహలా కార్యక్రమంలో మోహన్ భాగత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుష్ట శక్తులకు ఎలాంటి కోచింగ్ అవసరం లేకుండానే ఎప్పుడూ క్రియాశీలకంగా, ఐకమత్యంగా వుంటాయన్నారు. మనం ఎల్లప్పుడూ సద్గురువులను దర్శిస్తూ.. వారి మార్గదర్శనం తీసుకుంటూ వుంటామని, కానీ దుష్టశక్తులకు అలాంటి శిక్షణేదీ అవసరం వుండదని పేర్కొన్నారు.
దుష్ట శక్తులు ప్రపంచ వ్యాప్తంగా వున్నాయని, వారి దుష్ట పనులు ప్రపంచమంతా వ్యాప్తి చెంది వున్నాయని తెలిపారు. బంగ్లాదేశ్ కేసు మొదటిది కాదని, అమెరికా మొదటి కేసు అని వివరించారు. ఓ అమెరికన్ రచయిత రాసిన ‘‘కల్చరల డెవలప్ మెంట్ ఆఫ్ అమెరికా’’ అనే పుస్తకాన్ని తాను చదివానని, గత 100 సంవత్సరాలలో అమెరికాలో సాంస్కృతిక అధోగతి ఎలా జరుగుతుందో అందులో వివరిస్తారని తెలిపారు. ఈ క్షీణత పోలాండ్ లో పునరావృత్తమైందని, అరబ్ దేశాలకు వ్యాపించిందని, ఇటీవల బంగ్లాదేశ్ లో జరిగిందని సోదాహరణంగా వివరించారు.
ప్రపంచంపై తమ ఆధిపత్యాన్ని పెంచుకొని, తాము నమ్మేదే సరైనదని చెప్పేవారు. ఇతరులది తప్పు అనే వారు కేవలం తమ స్వలాభం కోసం విభజన ధోరణునుల ప్రోత్సహిస్తున్నారని మోహన్ భాగవత్ విమర్శించారు. కానీ ఇలాంటి ధోరణులు విపత్తులకు, దేశాల పతనానికి దారితీస్తాయన్నారు. ఇలాంటి ధోరణులను మనమందమరమూ క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూనే వుండాలని, ఈ ధోరణులు పెరిగి పెరిగి భారత్ కి చేరుకున్నా... వారికి అంతిమ సంస్కారాలు చేయాలని, అప్పుడు మాత్రమే అవి తగ్గుముఖం పడతాయని చరిత్ర చెబుతోందని అన్నారు.
Barat.maatajki.jai
ReplyDelete