జైనూర్‌లో హై టెన్షన్... అట్టుడుకుతోన్న ఏజెన్సీ
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ అట్టుడికిపోతోంది. రెండు వర్గాల మధ్య ఘర్షణతో.. శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. జైనూర్ లో వ్యాపార, వాణిజ్య సముదాయాలు అగ్నికి ఆహుతయ్యాయి. అలాగే ఇరు వర్గాలవారికి చెందిన ఇళ్లు, వాహనాలకు నిప్పంటించారు. దీంతో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఇటు సమాచారం అందుకున్న పోలీసులు, ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా అల్లర్లు అదుపులోకి రాకపోవడంతో ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు.
అసలు ఇంతటి హింసకు కారణమేంటంటే.. ఆగస్టు 31 న జైనూరు మండలం దేవుగూడ శివారులో ఓ ఆదివాసీ మహిళను ఆటో డ్రైవర్ షేక్ మగ్దూం.. తన ఆటో ఎక్కించుకున్నాడు. రాఘాపూర్ దాటగానే.. ఒంటరిగా ఉన్న ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో.. ఓ ఇనుప రాడ్డుతో ఆమె ముఖంపై తీవ్రంగా గాయపర్చాడు. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో.. ఆమెను రోడ్డుపై పడేసి డ్రైవర్ షేక్ మగ్దూం పారిపోయాడు.
అయితే రక్తపు మడుగులో పడి ఉన్న మహిళను గమనించిన స్థానికులు.. 108లో జైనూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత ఆదిలాబాద్ రిమ్స్‌కు, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మరోవైపు గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందని.. బాధితురాలి సోదరుడు ఈ నెల 1న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలు స్పృహలోకి రావడంతో.. అసలు విషయం వెలుగులోకొచ్చింది. తనపై ఆటో డ్రైవర్ షేక్ మగ్దూం లైంగిక దాడితో పాటు.. రాడ్డుతో కొట్టిన విషయాలను పోలీసులకు తెలియజేసింది. దీంతో నిందితుడిపై లైంగికదాడి, హత్యాయత్నంతో పాటు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
మరోవైపు ఈ దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆదివాసీలు.. నిందితుడు షేక్ మగ్దూంను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ.. జైనూర్ లో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. జైనూర్ తో పాటు.. సిర్పుర్(యు), లింగాపూర్ మండలాలకు చెందిన ఆదివాసీలు చేరుకుని నిందితుడిని తక్షణం శిక్షించాలంటూ ఆందోళన చేపట్టారు. అలాగే ఈ ఘటనకు నిరసనగా.. బుధవారం ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో రెండు వర్గాల మధ్య హింస చెలరేగింది. పదుల సంఖ్యలో షాపులు ధ్వంసమయ్యాయి. ఇళ్లు, వాహనాలు తగులబడిపోయాయి.
A tribal woman in Jainoor, Asifabad, Telangana suffered a horrific sexual assault at the hands of Sheik Makdoom, an auto driver. She was not only violated but later also brutally assaulted.
— Sumiran Komarraju (@SumiranKV) September 4, 2024
Shockingly, the police, under the #CONgress Government, are shamefully dismissing this… pic.twitter.com/9wolNRqviF
ఆదివాసీల్లో ఇంతటి ఆవేశానికి కారణమేంటి..?
అసలు ఎక్కడ వచ్చింది సమస్య..?
వాస్తవానికి ఆదివాసీలు ఎప్పుడైనా శాంతస్వభావులే. వారి జీవనవిధానమే అందుకు నిదర్శనం. అయితే గతకొన్నేళ్లుగా గిరిజన ప్రాంతాల్లో.. గిరిజనేతరులు ముఖ్యంగా ముస్లీంల జనాభా పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో వనవాసీలపై దాడులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది మే నెలలో ఆదివాసీ యువకుడైన మర్సుకోల లక్ష్మణ్ పై ముస్లీం వ్యక్తి దాడి చేయడం.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్త సంచలనంగా మారింది. ఆ సమయంలో ఆదివాసీలంతా కలిసి తీర్మానం సైతం చేశారు. ఏజెన్సీ మండలాల్లో 1/70 పెసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని.. అలాగే మసీదుల పరిమితిని తగ్గించాలని.. అక్రమంగా వలస వచ్చిన గిరిజనేతర ముస్లింలను మైదాన ప్రాంతానికి తరలించాలంటూ రకరకాల తీర్మానాలు చేసి.. ప్రభుత్వ అధికారులు, పోలీసులకు అందజేశారు.
కానీ.. ఇప్పటికీ ఆదివాసీల డిమాండ్లు కార్యరూపం దాల్చలేకపోగా.. దాడులు మరింత పెరుగుతున్నాయి. దీంతోనే గిరిజన మహిళపై అత్యాచార, హత్యాయత్నంపై ఆదివాసీల్లో తీవ్ర నిరసనకు కారణమైంది. అందుకే తాజా ఆందోళనల్లో కూడా ముస్లీంలను ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతాలకు తరలించాలనే డిమాండ్లను మరోసారి వినిపించారు.
ఇదిలా ఉంటే.. జైనూరులో జరుగుతున్న అల్లర్లపై తెలంగాణ డీజీపీ స్పందించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని.. తప్పుడు కథనాలతో రెచ్చగొట్టొద్దని.. స్పష్టం చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉందని.. త్వరలోనే పరిస్థితి అదుపులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
...vskts