యూపీలోని ఓ మదర్సాలో నకిలీ నోట్ల ముద్రణ జరుగుతోందన్న సమాచారం అందుకున్న పోలీసులు... వెళ్లి దాడి చేయగా... అక్కడ ఆరెస్సెస్ పై తప్పుడు ప్రచారం చేసే పుస్తకాన్ని కూడా కనుగొన్నారు.
అతర్సుయా ప్రాంతంలోని జామియా హబీబియా మసీదు ఆజం మదర్సాలో పోలీసులు దాడి చేయగా, నకిలీ కరెన్సీతో పాటు ఆరెస్సెస్‌పై ఓ పుస్తకాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. RSS: The Biggest Terrorist Organisation in the Country (RSS: The Biggest Terrorist Organization in the Country) అనే పుస్తకం ఉర్దూ నుండి హిందీలోకి అనువదించబడింది. ఈ పుస్తకాన్ని SM ముషారఫ్ రచించాడు.
ఆరెస్సెస్ పై తప్పుడు ప్రచారం చేయడానికి, ప్రజల్లో తప్పుడు భావాలు నాటడానికి మౌల్వీ మహ్మద్ తఫ్సీరుల్ ఆరీఫీన్ ఈ పుస్తకాన్ని వుపయోగించుకుంటున్నాడన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ దాడిలో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అలాగే 100 రూపాయల నకిలీ నోట్లు, ప్రింటింగ్ పరికరాలు, నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు మదర్సా అధికారి తఫ్సీరుల్ మదర్సాలోని ఓ గది కేంద్రంగా నడిపిస్తున్నాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపక్ భుకర్ ప్రకటించారు. మరోవైపు మదర్సా కేంద్రంగా ఇలాంటి కార్యకలాపాలు జరగడం అందరికీ ఆందోళన కలిగిస్తోంది.
అంతేకాకుండా ఆరెస్సెస్‌కి వ్యతిరేకంగా విద్వేషపూరిత వాతావరణాన్ని పెంపొందించేందుకు జరుగుతున్న కసరత్తు, అలాగే అక్కడి విద్యార్థుల్లో కూడా ఆరెస్సెస్ పై ద్వేష భావం పెంపొందించేందుకు చేస్తున్న కసరత్తు కూడా మరోసారి బయటపడింది. అంతేకాకుండా ఆరెస్సెస్ పై ఆ మౌల్వీ వేసిన పుస్తకంపై పోలీసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంస్థల్లో ఇలాంటి పుస్తకాలను వ్యాప్తి చేయడం వల్ల ప్రమాదకరమైన భావాలు ప్రబలుతాయన్నారు. ఇది కేవలం నకిలీ కరెన్సీకి సంబంధించిన విషయమే కాదని, దీని వెనుక తీవ్రమైన ఉద్దేశాలున్నాయని అన్నారు. పిల్లల మనసులో ఆరెస్సెస్ వ్యతిరేక భావాలను నింపేందుకు మౌల్వీ ఈ పుస్తకాలను వాడుతున్నారని తాము అనుమానిస్తున్నామని, ఇది తీవ్రమైన సమస్య అని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు.

ఇక... మదర్సాపై ఈ దాడి జరిగిన తర్వాత స్థానిక ఇంటెలిజెన్స్ అధికారులు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు మదర్సా సిబ్బందిని, అందులో చదువుతున్న విద్యార్థులను విచారించారు. అయితే.. వారి నుంచి సరైన సమాచారం తమకు రాలేదని పోలీసులు అంటున్నారు. అరెస్టైన వారిపై భారతీయ న్యాయ సంహిత కింద కేసులు నమోదు చేశారు.
Courtesy : vskts