Forced Resignation of Hindu Teachers in Bangladesh |
తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడి రెండు వారాలు దాటినా బంగ్లాదేశ్లో ఇంకా పరిస్థితులు సాధారణస్థితికి రాలేదు. జర్నలిస్టులపై నిర్బంధం కొనసాగుతోంది. హిందూ ఉపాధ్యాయులతో బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారు.
వివిధ పాఠశాలలు, కాలేజీలలో పనిచేస్తున్న సుమారు 70 మంది హిందూ ఉపాధ్యాయులు బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. వీరిలో అజీమ్పూర్ గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గీతాంజలి బారు వ కూడా ఉన్నారు. ఈమెను విద్యార్థులు చెట్టుకు కట్టేయగా, ఆర్మీ జోక్యం చేసుకొని విడిపించింది. అలాగే, హోలీ రెడ్ క్రిసెంట్ నర్సింగ్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సోనాలి రాణీ దాస్ కూడా బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది.