Will London become an Islamic London |
యునైటెడ్ కింగ్డమ్లో ఉగ్రవాద భయం గురించి ప్రపంచం మొట్ట మొదటిసారి 2010లో గుర్తించింది. అబ్దుల్లా ముత్తలాబ్ లండన్‌లో పాక్షిక ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాడు. ఇది క్రమంగా ముహజిరౌన్ ఉగ్రవాద సంస్థ ఏర్పాటుకు దారితీసింది.
ఆ తర్వాత క్రమంగా పశ్చిమ దేశాల్లో ఉగ్రవాద విస్తరణకు UK కేంద్రంగా మారుతున్నదన్న అంశం స్పష్టమవుతూ వచ్చింది. USలో 9/11 దాడులకు ముందే లండన్‌లో ఉగ్రవాద గ్రూపుల సంఖ్య వివరీతంగా పెరిగిపోవడంతో ‘లండనిస్తాన్’ అనే పేరును చాలామంది వాడటం మొదలుపెట్టారు. న్యూయార్క్ టైమ్స్, వానిటీ ఫెయిర్, వీక్లీ స్టాండర్డ్ వంటి పత్రికలు ‘లండనిస్తాన్’గా పేర్కొనడంతో ఇది మరింత ప్రాచుర్యం పొందింది. బ్రిటన్ జర్నలిస్ట్ మెలానీ ఫిలిప్స్ ఏకంగా ‘Londonisthan: How Britan is creating Terror state within’ పేరుతో ఆల్ 2006లో ఒక పుస్తకమే ప్రచురించాడు.
నిజానికి ‘లండనిస్తాన్’ అనే పదాన్ని మొట్టమొదట వాడింది ఫ్రెంచి పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు. ఇస్లామిక్ తీవ్రవాదులపై అప్పట్లో ఫ్రెంచ్ పోలీసులు దాడులు చేసినప్పుడు వాళ్లు లండన్‌కు పారిపోయేవారు. అప్పుడు ఫ్రెంచ్ అధికార్లు, ఆ విధంగా పారిపోయి లండన్ వచ్చినవారిని గుర్తించేందుకు సహకరించాల్సిందిగా బ్రిటన్ అధికార్లను కోరినప్పుడు వారి నుంచి సహకారం అందేది కాదు. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడంలో లండన్ అధికార్ల నిర్లక్ష్య వైఖరితో విసిగిన ఫ్రెంచ్ పోలీసులు బ్రిటన్ రాజధానిని ‘లండనిస్తాన్’ అని పిలవడం మొదలు పెట్టారు. ఇదిలావుండగా తర్వాతికాలంలో బ్రిటన్ ప్రభుత్వాలు ఉగ్రవాద సంస్థలను నిషేధించడం, ఉగ్రవాదులపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో UKలో రాడికలైజేషన్ అప్పటిస్థాయిలో లేనప్పటికీ, ఉగ్రవాద సమస్య పూర్తిగా తొలిగిపోలేదన్నది మాత్రం వాస్తవం.
లండనిస్తాన్ అన్న పేరు వచ్చినందుకు… సాదిక్ ఖాన్ మూడోసారి ఆ నగరానికి మేయర్ కావడానికి… దగ్గరి సంబంధం లేకపోలేదు. లేబర్ పార్టీకి చెందిన ఖాన్ మూడోసారి ఆ నగరానికి మేయర్‌గా మే 4న ఎన్నికయ్యారు. మే 2వ తేదీన జరిగిన ఎన్నికలో 40.5 శాతం ఓటింగ్ మాత్రమే నమోదై, సాదిక్ ఓటమి తప్పదన్న ఊహాగానాల మధ్య తిరిగి వరసగా మూడోసారి ఆయనే గెలిచాడు.