ఇత్తేహాద్ మిల్లత్ కౌన్సిలింగ్ నేత, ఛాందసవాది తౌకీర్ రజాఖాన్ మళ్లీ వాతావరణాన్ని చెడగొట్టే వ్యాఖ్యలు చేశాడు. సున్నితమైన బరేలీ వాతారణాన్ని చెడగొట్టే వ్యాఖ్యలు చేశాడు. కొన్ని రోజుల క్రిందటే కన్వర్ యాత్ర సందర్భంగా ఇప్పటికే అల్లర్లు రేగాయి.
ఇప్పుడు మళ్లీ... హిందూ మహిళలందర్నీ సామూహికంగా మత మార్పిడి చేస్తామంటూ ప్రకటించారు. దీంతో అక్కడ వివాదం నెలకొంది. మౌలానాపై చర్యలు తీసుకోవాలని, ఆ సంస్థను రద్దు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ నెల 21 న బరేలీలో సామూహికంగా హిందూ మహిళలను మత మార్పిడి చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని విలేకరుల సమావేశం పెట్టిమరీ ప్రకటించాడు.
ఈ సమయంలో నమాజ్ చదివిస్తామని, కలామ్ కూడా చదివించి, ఇస్లాంలోకి ఆహ్వానిస్తామన్నారు. వివాహాలు కూడా జరిపిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ఇత్తేహాద్ మిల్లత్ పరిపాలన అధికారుల నుంచి అనుమతి కూడా కోరింది. ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించగానే.. విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మౌలానాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆ సంస్థపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. 2010 లో బరేలీలో జరిగిన మతపరమైన అల్లర్లలో తౌకీర్ మాస్టర్ మైండ్‌గా వున్నాడు.
హిందూ జాగరణ్ మంచ్ కూడా తీవ్రంగానే స్పందించింది. మౌలానా తాకీర్ లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నారని, హిందూ బాలికల సామూహిక మత మార్పిడి కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని అరుణ్ ఫౌజీ ప్రకటించారు. హిందువుల నుంచి పెద్ద ఎత్తున ప్రతిఘటన రావడంతో ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు.
vskts